నీకింకా బోధపడ లేదా... !;- కోరాడ నరసింహా రావు.
చెట్టుతో స్నేహించి ప్రేమగా... 
   ఆలింగనం చేసుకోవాల్సిన మనిషి.... !
 స్వార్ధానికితెగనరుకుతున్నాడు
ఎక్కిన కొమ్మను నరుక్కునేతీరు 
బ్రతుకునిచ్చే చెట్టును... తన కాష్టానికి కట్టెలుగా మార్చుకుం టున్నాడు... !

        మన జీవితాలను పచ్చగా
పండించేప్రయత్నం తను చేస్తుం
టే... తనను మోడును చేసి.... 
మన బ్రతుకుల్ని మనమే ఎండ గట్టు కుంటున్నాం !  
      రాళ్లతో కొట్టినా పళ్లనే ఇచ్చే 
చెట్టు...గొడ్డళ్లతో నరికిన, రంపా లతోకోసినా...మేకులతోతూట్లు
పొడిచినా... అది మన  సుఖం కోసమే  పరితపిస్తుంది !అచ్చం అమ్మలా.... !!
 అందుకే...అమ్మలాంటిచెట్టును
అభిమానంతోప్రేమించి,ప్రేమగా
ఆలింగం చేసుకోమనే సందేశం 
నీకింకా బోధపడలేదామానవా!
     *******

కామెంట్‌లు