సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 కోపాలు... తాపాలు... 
   ******
కోపాలు, తాపాలు రెండూ కూడా బాధించేవి,వేధించేవి. మనిషికి రాకూడనివి. స్థిమితంగా ఉండనీయనివి.
కోపాన్ని క్రోధం, ఆగ్రహం అంటారు.
కోపాలు ఎందుకు వస్తాయంటే...మనసుకు నచ్చని విధంగా ఎదుటి వ్యక్తులు ప్రవర్తించినా,అభిప్రాయాలను గౌరవించక పోయినా, విమర్శించినా వస్తాయి.
అలా వారిపై మనుసులో కలిగే వ్యతిరేక భావనలను,ఉద్రేక స్పందనలను కోపాలు అంటారు.
కోపం వలన మనసు అస్థిమితంగా మారుతుంది, ఆవేశం పెల్లుబుకుతుంది. తద్వారా మాటలు తూలడం జరుగుతుంది.ఇలాంటి స్థితి వల్ల ఇతరుల ముందు చులకనై పోతారు.
ఇక తాపాలు మనశ్శరీరాలను ఎప్పుడూ కష్టపెట్టేవే.
మానసికంగా, శారీరకంగా కలిగే తాపాలు, పశు పక్ష్యాదుల వల్ల కలిగే తాపాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే తాపాలు... ఇలా మూడు రకాల తాపాలను మనుషులు ఎదుర్కొంటూ ఉంటారు.
కోపాలను తగ్గించుకుని మనసును ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
తాపాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు