పండుటాకులు;-.. బెజ్జంకి మాచర్ల, పల్నాడు జిల్లా.ఆం.ప్ర
ఎందుకు ఇంకెందుకు
అంటోంది సమాజం
అదీనిజమే అదీనిజమె

నమిలేసిన చెరకు పిప్పి
పిండేసిన నిమ్మతొక్క
చీకేసిన మామిడిటెంక
రాసేసిన బలపం పిక్క
పారేస్తారోయ్ పారేస్తారోయ

ఆలికి కష్టు
కాలికి కష్టం
చేయూత
కర్రకు కష్టం

ఇంకెందుకు
ఇంకెందుకు
ఈ తిత్తిలో
గాలెందుకు

విరిగిన గాజులు
అరిగిన చెప్పులు
మురిగిన పండ్లు
పెరిగిన గోళ్ళు
తీసెయ్యాలోయ్ 
తీసెయ్యాలోయ్

చీకిన బట్టలు
చిమ్మిన చెత్త
పగిలిన కుండ
తగలని బాణం
వ్యర్ధం వ్యర్ధం వ్యర్ధం

అంటోంది 
ఈ నవ సమాజం
మా నవత్వంమంటోంది
       ...


కామెంట్‌లు