ధన్యుడు...వదాన్యుడు
******
ధన్యుడుగా ఉండాలా..!,వదాన్యడుగా గడపాలా.!, రెంటినీ కలబోసిన వ్యక్తిగా ఉన్నతంగా జీవించాలా అనేది ఆయా వ్యక్తుల హృదయ సంస్కారంపై ఆధారపడి ఉంటుంది.
సుమతీ శతక కర్త అన్నట్లు తానొవ్వక, నొప్పించక.. తన పనేదో తాను చేసుకుంటూ ఉన్న దాంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపే వ్యక్తిని ధన్యుడు లేదా పుణ్య వంతుడు అంటారు.
అలా ఉండటం అతనికి ప్రశాంతత చేకూరుతుంది. ఆ వ్యక్తి వల్ల సామాజిక పరమైన ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడే వ్యక్తిత్వం ధన్యుడిది.
వదాన్యుడు అంటే దాత. దానగుణం కలిగిన దానశీలి.సాటి వారికి తనవంతుగా సాయం చేసే వితరణశీలి.
అలాంటి వదాన్యుల వల్ల ఆర్థిక ఇబ్బందులతో బాధ పడే సాటి వ్యక్తులకు, ఎంతో మేలు జరుగుతుంది.
సమాజానికి ఇలాంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉంది.
ఎందరో పేదరికంతో బాధ పడేవారు, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆశలు తీరని వారు ఇలాంటి వదాన్యుల సహాయ సహకారాలతో జీవితాల్ని మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుంది.
అందుకే ధన్యులుగా బతకడమే కాకుండా చేతనైనంత సాయం చేస్తూ వదాన్యులుగా జీవనం సాగిస్తే జన్మ సార్థకం అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి