మ గుణింతo
=============
మల్లెలాoటి మనసుతో
మాధుర్యమైన స్వరంతో
మిలమిల లాడే ఛాయతో
మీనాల్లాoటి నయనాలతో
ముద్దులొలికే మోముతో
మూర్తీభవించిన కారుణ్యoతో
మృదువైన పలుకులతో
మెత్తని సున్నితమైన మనసుతో
మేరువులాంటి వ్యక్తిత్వంతో
మైమరచిపోయే అందంతో
మొగ్గలా ముకుళిoచే సిగ్గుతో
మోహనమైన నీ రూపం
మౌనరాగం మీటుతుంది
మంద్రస్థాయిలో హాయి హాయిగా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి