జీవిత లక్ష్యం; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
లక్ష్యం అంటూ ఒకటుంటేనే
గోల్ అంటూ పెట్టుకుంటేనే
సాధించడానికి ప్రయత్నిస్తాం
అందుకోవాలని కోరుకుంటాం.

కలలు కంటెనే కదా
సాకారం చేసుకోవడానికి
ఆశా పడితేనే కదా
ఆకాశం అందుకోవడానికి

ఆశా దురాశ కాకూడదు
కలలు పగటి కలలు కారాదు
అత్యాశ జీవిత లక్ష్యం కాదు
సామర్థ్యం బట్టే గమ్యం ఎంచుకోవాలి.

పాల కుండ నెత్తిన బెట్టుకుని
ఫారిన్ వెళ్ళాలని అనుకుంటే
కాళ్ళు బార చాపుకొని ఖాళీగా
కనక వర్షం కురవాలంటే ఎలా

కష్టపడి పని చేసి చూపించాలి
కసితో నైపుణ్యం సాధించాలి
కలల సాకారం జరుగుతుంది
కన్నులు అర్ధ నిమీలాలు గా


కామెంట్‌లు