గౌరవం!!;- ప్రతాప్ కౌటిళ్యా
నిచ్చెనలా నిలబడ్డ మనిషి
ఎదిగిన ఎదగకున్నా
పదిమందికి కిందికి  దిగడానికి
పైకి ఎక్కడానికి పనికొస్తాడు!!?

కుర్చీని చేసి
కూర్చోమని చెప్పిన
నిలబడి నిండు నూరేళ్లు పచ్చగా బతికిన చెట్టు ఒకటే మనిషి అంత గొప్పది!!?

మాంసపు ముక్కల కోసం
రక్తాలు కార్చుకునే కుక్కలు
రెండు గడ్డి పరికలు పంచుకు తినే మేకలు
ఎదిగితే మేకలమవుతాం లేదా 
కుక్కల మవుతాం!!

అందము గంధము ఒకటే
ఏమి చేయకున్నా
పరిమళిస్తాయి!!

నీవే నవ్వాలి
నీవే ఏడవాలి
ముందు నువ్వు ఉండాలి!!?

ఎదగడం అంటే
మహా పర్వతాలు లా కాదు
మట్టిలోంచి పుట్టిన
అన్నం ముద్దలా!!?

అందరికీ ఆదర్శంగా
కేవలం దర్శనం కోసం
వేచి ఉన్నట్లు!!?

గొప్పగా ఉండు కానీ
గాలిలా కనిపించకు!!

ఒదిగినది ఒత్తి
వెలుగుతూనే ఉంటుంది!!

కరిగిపోనిది కాలం
నువ్వు ఉండాలి!!?

తీర్థాన్ని మంచినీళ్ల తాగడం
నేర్చుకుంటే
సముద్రంతో స్నేహం చేయవచ్చు!!?

స్నేహం ప్రేమ మాత్రమే ఉన్నాయి
పూర్వం నుంచి
మనిషి పుట్టినాకనే
గౌరవం పుట్టింది!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు