బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దేవతల పలాయనము - బృహస్పతి రుద్ర దేవుడు అజేయుడు అని చెప్పడం - విష్ణువు, వీరభద్రుని సంభాషణ - దేవతలు వెళ్ళి పోవడం - యజ్ఞ ధ్వంసం - వీరభద్రుడు కైలాసం చేరడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*యజ్ఞ ప్రాంగణాన్ని వదలి పారిపోతున్న ఇంద్రాదులను, దేవగణ సమూహాన్ని చూచి అక్కడ వున్న మునులు, రుషులు ఇప్పుడు ఈ యజ్ఞము సర్వనాశనం అవబోతోంది, దీని రక్ష చేయగలిగిన వాడు విష్ణుమూర్తి ఒక్కడే అని వారందరూ విష్ణువు ను చేరి, "నీవే సర్వానికి కారకుడవు. సర్వ సమర్ధుడవు. కాబట్టి దక్షుని యజ్ఞాన్ని రక్షించు, దయామయా!" అని ప్రార్థన చేసారు. దక్షుడు ఇంతకు ముందే వేడుకున్నాడు. యజ్ఞాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన వీరభద్రుని తో విష్ణుమూర్తి, "వీరభద్రా! నీవే శంకర సమానుడవు. నీవు తలచుకుంటే ఎటువంటి కార్యమైనా సఫలం అవుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ, నీవు నేను కూడా వేరు కాదు. నేనేమో భక్త పరాధీనుణ్ణి. అందుకే వీరిని రక్షించడానికి ఇక్కడకు వచ్చాను. నీవు యుద్ధంలో నన్ను జయించాలి అనుకుంటే అలాగే కానీ, శంకర ప్రియ వత్సా! నీవు శంకరుని కోపము వలన ఉద్భవించిన వాడవు. రుద్రతేజస్వరూపుడవు. నిన్ను ఎవరూ ఆపలేరు. నేను నా భక్త రక్షణ చేయాలి. ఇది నా ప్రతిజ్ఞ అని నీకు కూడా తెలుసు. నా భక్తుల మీదకు వెళ్ళాలి అంటే నీవు నన్ను జయించాలి. నిలు వీరభద్రా!" అని అన్నాడు.*
*తన స్వామి అయిన శివ భగవానుని స్తుతి విష్ణుమూర్తి నోట విని, వీరభద్రుడు చాలా సంతోషించి "శ్రీహరీ! శివుడూ మీరు ఒకటే తత్వం. శివుని ఆజ్ఞ ప్రకారమే ఏ పని అయినా అవుతుంది. మేము అందరమూ ఆ స్వామి సేవకులమే." అని విష్ణుమూర్తి తో అన్నాడు. ఈ మాటలు విని విష్ణుమూర్తి, "వీరభద్రా! ఎటువంటి సందేహం పెట్టుకోకుండా నీవు నాతో యుద్ధం చేయి. నీ బాణాలతో నాకు బాధ కలిగించు. నీకే జయము కలుగుతుంది. నేను నా లోకానికి తిరిగి వెళతాను" అన్నాడు.*
*విష్ణువు పలికిన మాటలు విని వీరభద్రుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. వీరిరువురికీ మధ్య మహా భీకరమైన పోరు జరిగింది. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం జరుగుతోంది. లోకాలు భీతి చెందుతున్నాయి. తుట్టతుదకు, వీరభద్రుడు విష్ణు చక్రాన్ని నిలువరించి, అజేయమైన శారజ్ఞ్గము అనే విష్ణు ధనస్సును మూడు ముక్కలు చేస్తాడు. బ్రహ్మ నైన నేను, సరస్వతీదేవి కలసి విష్ణువు కు విషయం వివరించిన తరువాత విష్ణుమూర్తి అక్కడ నుండి అంతర్ధానం అయ్యారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి