*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0174)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుని పై శివదేవుని భక్తవాత్సల్యము - దక్ష యజ్ఞము పూర్తి - సతీఖండ ఉపసంహారము - మహాత్మ్యము*
*నారదా! భగవానుడు అయిన రుద్ర దేవుని మాటలు విన్న విష్ణువు, నేను, మహర్షులు, మునులు, దేవీదేవతలు, దక్ష ప్రజాపతి అందరమూ చాలా ఆనందాన్ని అనుభవించాము. దక్షుడు కూడా శివ భక్తిలోని మాధుర్యము తెలుసుకుని, శివ నామస్మరణ లో తలమునకలు అయ్యాడు. దేవతలు మొదలైన వారు కూడా సదాశివుడే సర్వేశ్వరుడు అని తెలుసుకుని ఆ స్వామి భజనలోనే వున్నారు. తరువాత, శివభగవానుని ఆజ్ఞ ప్రకారం శివభక్తుడు అయిన దక్షుడు ప్రసన్న మనస్కుడై తాను తలపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేశాడు. మొట్టమొదటి యజ్ఞ భాగాన్ని శివ మహాదేవునికి ఇచ్చి, మిగిలిన దేవతలకు కూడా యజ్ఞ భాగాన్ని ఇచ్చాడు. బ్రాహ్మణులకు, మునలకు దానములు ఇచ్చి సంతోషపెట్టాడు.*
*నారదా! పరబ్రహ్మ స్వరూపమైన శివుని ఆజ్ణ వల్లనే దక్షుడు తన యజ్ఞము పూర్తి చేయగలిగాడు. రుషులు, మునులు దేవతలు పరమేశ్వరుని కీర్తిస్తూ వారి వారి ఇండ్లకు వెళ్ళారు. విష్ణువు, నేను కూడా మా నెలవులకు చేరుకున్నాము. మహాదేవుడు మంచివారికి ఆశ్రయము ఇస్తారు. దక్షుని చేత సన్మానించబడిన శివుడు, తన శివ పార్షదులతో కలసి కైలాసానికి వెళ్ళారు. అక్కడ ధ్యాన మగ్నుడై సతీదేవిని స్మరించెను.*
*దక్ష యజ్ఞము లో తన శరీరమును త్యజించిన ఉమ, హిమాలయములకు వెళ్ళి తపస్సు లో వుండి హిమాలయుని భార్య అయిన మేనక గర్భమున జన్మించింది. మరల తపస్సు చేసి గౌరీదేవిగా, శివుని అర్ధభాగం చేరుతుంది. అర్ధనారీశ్వరం ఏర్పడింది. భక్తుల కోరికలు తీరుస్తూ, అనేక లీలలు చేసారు అర్ధనారీశ్వరులు.*
*|| రుద్ర సంహితయందలి సతీఖండము సంపూర్ణము ||*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు