*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 079*
 *చంపకమాల:*
*మనమున నూహపోహలను | మర్వక మున్నె కఫాదిరోగముల్*
*దనువున నంటి మేని బిగి | దప్పకమున్నె నరుండు మోక్షసా*
*ధన మొనరింపఁగావలయుఁ | దత్వ విచారము మానియుఁడుట*
*ల్తనువునకున్ విరోధమిది | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
మనసులో ఊహలు, ఆలోచనలు రావడం ఆగిపోక ముందే, జలుబు, జ్వరము వంటి రోగములచే శరీర దృఢత్వం తగ్గిపోక ముందే మానవులు మోక్షము సాధించడానికి అవసరమైన సాధన చేయడం వల్ల తత్వ విచారము చేయడానికి అలవాటు పడాలి. అలా తత్వ విచారము చేసినప్పుడే ఆత్మ స్వరూపము చక్కగా కనిపిస్తుంది!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*మన శరీరంలో శక్తి వున్నంత వరకు ఈ భూమి మీద మన చుట్టూ కనిపించే శాశ్వతము కాని అందాలు, అనవసరమైన విషయాల చుట్టూ తిరుగుతూ వుంటారు మానవులు. భగవంతుడు మనకు ఇచ్చిన తెలివితేటలను చక్కని రాజ మార్గ మైన దైవ భక్తి, ఇతరులకు మేలు చేయడం, నలుగురి ఆనందంలో మన ఆనందం వుంది అని ఒప్పుకోవడం లాంటి అలోచనలు రానీయకుండా సమాజంలో వింత జీవిలా తిరుగుతూ వుంటారు. ఈ పనుల వల్ల ఎంతో విలువైన సమయాన్ని మనం పోగొట్టుకుంటాము. అందువల్ల, మన శరీరం లో శక్తి వున్నప్పుడే, ఇతరుల మేలు కోరడం, నలుగురికి ఆనందం కలిగించే పనులు చేయడం, రోజులో కొన్ని నిమిషాలైనా ఎంతో ఉన్నతమైన ఈ మానవ జన్మ ఇచ్చిన ఆ భగవంతుని తలచుకోవడం, అలా మన పుట్టుకకు కారణమైన మన తల్లి తండ్రులకు నమస్కరించడం వంటి పనులు చేస్తే, మన ఖాతా లో చేరే పుణ్యం మనకు చివరి కాలంలో మోక్షం పొందడానికి ఉపయోగపడుతుంది. అటువంటి సద్బుద్ధి మనకు కలిగించమని గిరిజాపతిని వేడుకుంటూ.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు