చిన్నారి దేవదత్తుడికి మహారాణి నాయనమ్మ ఎన్నో వింత విచిత్ర కథలు చెప్పేది. తను రాజమాత ఐనా కూడా ఒక్కగానొక్క మనవడి ఆలనాపాలనా తనే స్వయంగా చూసేది. ఆమె చెప్పిన జానపద కథలు ఆబుజ్జి రాకుమారుడి బుర్ర లో బాగా నాటుకున్నాయి. అందులో ఓకథ స్వర్గం లోని పూలతోటని గురించి!అక్కడ ఎన్నటికీ వాడని పూలు కుళ్ళిపోని పళ్ళు ఉంటాయి అని రంగుల కీటకాల పక్షులతో తోట నందనవనంలా ఉంటుందని కొన్ని పూలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని చెప్పేది. "జ్ఞానం పూలు ఎలా ఉంటాయి బామ్మా?""అవి రకరకాల శాస్త్రాలకి సంబంధించినవిరా కన్నా! వాటిని ఇలా ముట్టుకుని అలా వాసన చూస్తే చాలు మనకు అంతా తెలిసిపోతుంది. చెట్లకున్న పళ్ళు తింటే జ్ఞాపకశక్తి పెరుగు తుంది. ఎన్నో భాషలు తెలుస్తాయి తెలుసా?"
దేవదత్తుడికి అలాకుతూహలం జిజ్ఞాస పెరగడంతో తండ్రి తోపాటు వేటకి వెళ్లేవాడు.అన్నివిద్యల్లో ఆరితేరి పాతికేళ్ళ పడుచు వాడైనాడు.ఎలాగైనా స్వర్గం లోని తోటని చూడాలని వాడి కోరిక! బామ్మ చనిపోయినా ఆమె మాటలు చెవిలో రింగుమనేవి.స్వర్గం కి దారి ఎటు అని సాధుసన్యాసులని అడిగేవాడు. అంతా మాకుతెలీదంటే మాకు తెలీదు అనేవారు.
ఆరోజు దేవదత్తుడు అడవిలో పోతుండగా కారుమబ్బులు కమ్మి బడబడా జడివాన మొదలైంది. కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి!గుర్రం బురదలో కూరుకు పోయి నడవలేనని మోరాయించింది.రాకుమారుడు తడిసి ముద్దగా మారి గజగజవణకసాగాడు.మెరుపు వెలుగులో ఓ గుహ కనపడితే అందులోకి వెళ్లాడు. దూరం గా పొయ్యి మండుతోంది.ఒక ముసలవ్వ దాని ముందు రొట్టెలు కాలుస్తోంది.మొహం ముడతలు పడినా ఒళ్లు దృఢంగా ఉంది. "అమ్మా!" ఆర్తిగా పిల్చాడు దేవదత్తుడు. "రానాయనా" ఆదరంగా ఉంది ఆమె స్వరం!"అయ్యో!బాగా తడిశావు.ఇలా పొయ్యి దగ్గర కూచో!" ఆమెకి తనను పరిచయంచేసుకున్నాడు."నాకొడుకులు వచ్చేటప్పటికి బాగా ఆలస్యం అవుతుంది. ముందు ఈరొట్టెలుతిను". "అమ్మా!నీకొడుకులు ఏంచేస్తారు?" "వాళ్ళు స్వర్గం లో చిన్న చితక దేవుళ్ళతో ఆడుకుంటారు.కాస్త దుష్ట స్వభావం కలవారుబాబూ! తుఫాను సృష్టిస్తారు.మరీ గొడవ అల్లరి చేస్తే ఆనాలుగు సంచుల్లో పడేసి మూతి కట్టేస్తాను.ఇప్పుడు ఇలా అకాల వర్షం రావటానికి కారణం వారి దుడుకుతనమే బాబూ!" ఇంత లో మరుగుజ్జు వాడు ఒంటినిండా చేపలపొలుసులతో వచ్చాడు. "అమ్మోయ్!ఓఅమ్మా! ఒరే ఎవడివిరా నీవు? మాఅమ్మ దగ్గర తిష్ట వేశావు?" అవ్వ అంది"పెద్దోడా! గావుకేకలు వేయకురా!నాయనా! వీడు నాపెద్ద కొడుకు ఉత్తర తుఫాన్!" పరిచయం చేసింది. "అమ్మా! ఉత్తర ధ్రువం అంతా మంచుగడ్డలే అనుకో! నాచుట్టూ ధ్రువపు జింకలు ఎలుగు బంట్లు ఉన్నాయి.ఇదిగో పెద్ద చేపల్ని పట్టి తెచ్చాను." వాడిమాటపూర్తికాకుండానే రెండో కొడుకు పడమటి తుఫాను వచ్చాడు. వాడిచేతిలో పెద్ద గద ఉంది. "అమ్మా! మహా క్రూరమైన జంతువులను వడివడిగా ప్రవహించే నదీ నదాలను చూశాను."అని పెద్దగా తనుచూసినవి ఏకరువు పెడుతుంటే రాకుమారుడు ఆశ్చర్యంగా వింటున్నాడు (సశేషం)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి