అమ్మనాన్నలే నా ప్రపంచం;-బి. యమున,-10వ‌, తరగతి,-జి.ప.ఉ.పాఠశాల,-అమడబాకుల,-కొత్తకోట మండలం
 మా అమ్మనాన్నలంటే నాకెంతో ఇష్టమో, అంతకంటే చాలా గౌరవం. అమ్మ  శ్రీశైల, నాన్న శ్రీనివాసులు గార్లు. నాన్న మా కోసం ఎంతో కష్టపడి పనిచేసి మమ్మల్ని పోషిస్తాడు. మరికొన్ని సార్లు అదనపు శ్రమకోర్చి మా అవసరాల్ని తీరుస్తాడు. అమ్మ సైతం ఎండలో కూలిపనులకు వెలుతుంది. మమ్మల్ని వాళ్ళలా కాకుండా చదివిస్తున్నారు. వారు కన్న కలల్ని వారు నెరవేర్చుకోలేకపోయారు. వారి ఆశల్ని నెరవేరేలా మేము సైతం కష్టపడి చదువుతున్నాం. నా తల్లిదండ్రులు గుర్తుస్తేచాలు ఇంకా బాగా చదువుతాను. మాకు అనారోగ్యం వచ్చిన, అవసరమైన తీర్చేది వారే కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక తల్లిదండ్రుల్ని ఇచ్చాడు. నా తల్లిదండ్రులే నా ప్రపంచం. నేను బాగా చదువుకొని మా అమ్మనాన్నలను బాగా చూసుకుంటాను.


కామెంట్‌లు