రత్నలక్ష్మికి జీవన సాఫల్య పురస్కారం - 2022

 నంద్యాలలోని జలవనరుల శాఖకు సంబంధించి తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీరుగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.రత్నలక్ష్మికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత సాఫల్య పురస్కారం - 2022 లభించింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మనం ఫౌండేషన్ చైర్మన్ కె. చక్రవర్తి గారు తెలుగు పసిడి బిరుదు గ్రహీతయైన సాహితీ శ్రేష్టురాలు  శ్రీమతి ఎస్. రత్నలక్ష్మిని ఈ అవార్డుకు ఎంపిక చేసి పురస్కారాన్ని అంతర్జాల మాధ్యమం ద్వారా అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిలో మహనీయ మహోన్నత వ్యక్తి శ్రీ  ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద ఈ పురస్కారం లభించడం తనకెంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కవులు, కవయిత్రులు, ఉన్నతాధికారులు, సహోద్యోగులు, పట్టణ ప్రముఖులు ఆమెని ప్రశంసిస్తూ అభినందనలతో ముంచెత్తారు.


కామెంట్‌లు