"ప్రపంచగుడ్డుదినోత్సవం-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
ఎదుగుచుండెడిపిల్లలకిదియుమేలు
జరుపు,ప్రతిరోజుతినుచున్నపరివిధాల
పోషకాలనునిచ్చియుప్రోద్బలమ్ము
నందజేయును"గ్రుడ్డు"యేయహరహమ్ము!!!

02.
తే.గీ.
బ్రహ్మచారులయమృతపుభాండమిదియె
ఉడకబెట్టినగ్రుడ్లనునూదుకొనుచు
శుచిగభుజియించుచుందురుశుద్ధమతులు
దీనిఖనిజాలగనిగానుతీర్చినారు!!!

03.
తే.గీ.
కండపుష్టికితోడ్పడి,కండరముల
నిర్మితికిపాత్రవహియించునిలకడగను
ఉల్లిపాయలు,కారము,నుప్పువేసి
"ఆములెట్లు"గాజనులంతనారగించు!!!

04.
తే.గీ.
చర్మసౌందర్యమునకునుచాలినంత
విటమినులుసమకూర్చునుపటుతరముగ
మాంసకృత్తులుమెండుగామనకునొసగి
గ్రుడ్డుదివ్యౌషధంబాయె;కోరితినుము!!!

05.
తే.గీ.
బేకరీలలో"ఎగుపప్పు"పేరుతోడ
చిన్న,పెద్దలు,వృద్ధులుమిన్నగాను
"సాసు"వేసుకతినుచుంద్రుసంబరముగ
గ్రుడ్డుమహిమలునిట్లుండుగొప్పగాను!!!


కామెంట్‌లు