సీజనల్ ఫ్రూట్స్ తినండి రా బుజ్జులు;--డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఎప్పుడూ ఆపిల్, బనానా, అరేంజ్ లాంటివి మాత్రమే కాదు. అప్పుడప్పుడు అందుబాటులోకి వచ్చే సీజనల్ ఫ్రూట్స్ కూడా తింటూ ఉండాలి. సాధారణంగా దొరికే పండ్లతో పోలిస్తే సీజనల్ ఫ్రూట్స్ లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే ఇవి సీజన్ ఎండింగ్లో దొరుకుతాయి కాబట్టి దగ్గర దగ్గర కోత సమయంలో చేతికి అందుతాయి కాబట్టి రసాయనాలు చల్లి వీటిని పండించడం జరగదు. అదీకాక
ఫ్రూట్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో పండుతాయి అందువల్ల ధర చాలా తక్కువగా ఉంటుంది వీటికి.
పిల్లల్ని బాగా గమనించండి ఏదైనా కొత్త రకం పండ్లను గానీ, లేదా భోజనంలో కొత్త రకాల కూరలు గానీ పెట్టినప్పుడు దాన్నేదో ఓ వింత వస్తువులా చూస్తూ తిననంటూ మారాం చేస్తుంటారు. పొరపాటున బలవంతంగా నోట్లో పెట్టామా దాన్ని బయటకు ఊసేసి ఆ పదార్థం పైన అయిష్టాన్ని పెంచుకుంటారు. ఇలా జరిగితే చాలా ప్రమాదకరం. అందుకే పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి వాళ్లు చాలా సున్నిత మనస్కులు, అమాయకత్వాన్ని అణువణువునా నింపుకొని ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి మనమే ఏదో మాయచేసో మంత్రం వేసో మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. సమ్మర్ లో అయితే మ్యాంగోస్, వాటర్ మిలన్ లాంటివి దొరుకుతాయి. ఆ సీజన్లో ఎవరింట్లో చూసినా మ్యాంగోలు కనిపిస్తాయి కనుక పిల్లలు కూడా మ్యాంగో అంటే ఇష్టంగానే తింటారు. మరి సంవత్సరానికి ఒకసారి చేతికందే తాటికాయలు, తాటి ముంజలు, ఈత కాయలు, నేరేడు పండ్లు, రేక్కాయలు, సీతాఫలం, రామా ఫలం, జామకాయ లాంటి వాటి సంగతేంటి? సీజనల్ ఫ్రూట్స్ తినాలి అని నేను ఊరికే ఏం చెప్పడం లేదు. అవి మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో వైద్య విద్యార్థిని కనుక నాకు తెలుసు. 
సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల గుండె సమస్యలు, ఎముకల, కీళ్ల సమస్యలు, చర్మవ్యాధులు కిడ్నీ స్టోన్స్ లాంటి జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు. 
పండ్లు మాత్రమే కాదు ప్రకృతి అందించిన ప్రతి వస్తువు అద్భుతమైన ఆరోగ్య చిట్కాగా పనికి వస్తుంది. సాధారణంగా
నేను కూడా నేరేడు పళ్ళను పెద్ద ఎక్కువగా తినే దాన్ని కాదు. ఆ సీజన్ వచ్చినప్పుడు ఇళ్ల దగ్గరకు వచ్చి అమ్ముతుంటే నేను పెద్దగా ఆసక్తిని చూపించేదాన్ని కాదు.
కానీ నాకు మా అమ్మ నేను ఎప్పుడూ పుస్తకాల్లో చదవని ఒక కొత్త విషయాన్ని నాకు చెప్పింది అదేంటంటే సాధారణంగా మన జుట్టు ఇంట్లో రాలి పడి, గాలికి ఎగిరి తినే వస్తువులలో చేరినప్పుడు తెలియకుండా అది మన జీర్ణాశయంలోకి వెళ్ళిపోతే ఈ జుట్టుని జీర్ణం చేసే పదార్థం మన శరీరంలో లేదు. కనుక అది పేగులకు చుట్టుకుని అనేక రకాల జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. మా అమ్మ చెప్పింది ఏంటంటే ఈ నేరేడు పండు తినడం వల్ల ఆ జుట్టు జీర్ణం అయిపోతుందట అందుకే సంవత్సరానికి ఒక్కసారి అయినా తినాలి అంటూ నాకు బుద్ధి చెప్పింది.
దాంతో నేను ప్రతి సంవత్సరం
ఈ నేరేడు పండ్ల సీసన్ వచ్చినప్పుడు తినడం మొదలుపెట్టాను. సరే సరే అయితే అసలు విషయం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. పిల్లలకు 
తీపి వస్తువుల మీద ఉన్నంత ప్రేమ వగరు, పులుపు లాంటి
పదార్థాల పై ఉండదు. కనక దాన్ని మనమే అర్థం చేసుకుని పిల్లలు కేరింతల్లో మునిగినప్పుడు, లేదా పిల్లలందరూ ఒకచోట చేరినప్పుడు ఆటల ఆదమరుపున తినిపించాలి. పిల్లలూ మీరు కూడా "ఫ్రూట్ అర్ గుడ్ ఫర్ హెల్త్" అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని అమ్మ మీకు ఏ పండ్లను ఇచ్చి తినమన్నా తినడం అలవాటు చేసుకోండి. సరేనా మరి సీజనల్ ఫ్రూట్స్ బాగా తినండి... ఈ అక్క మాట వింటారు కదూ.... ఆరోగ్యంగా వుంటారు కదూ... ఓకే...!


కామెంట్‌లు