బిడ్డల శిక్షణ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఏ తల్లిదండ్రులు అయినా పిల్లల విషయంలో ఎంతో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు  వారి దృష్టి ముందు చదువు మీద ఉంటుంది  అ ఆ లు నేర్చుకోవడం నుంచి నుంచి పీహెచ్డీ వరకు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ జ్ఞానం వస్తుంది మంచి పేరు  పిల్లలకు వస్తోంది అని భావిస్తారు తల్లిదండ్రులు  ప్రత్యేకించి అమ్మ  వెంటబడి మరీ చదివిస్తుంది  ఒకవేళ పిల్లలు నలతగా ఉంటే తాను చదివి వినిపించి ఆ పాఠం వచ్చేంతవరకు  వదలదు  నిజానికి ఇది చాలా మంచి అలవాటు  అయితే వాడు బడికి వెళ్తారు అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠాల్లో నిమగ్నమై ఉంటారు  మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం  హోంవర్క్ ఇస్తే ఇష్టం ఉన్నా లేకపోయినా చేసి తీరాలి తప్పదు  అది పూర్తి చేసేసరికి వాళ్లకు చాలా నొప్పి వస్తోంది  అమ్మ ఈ రెండు మాటలు మాట్లాడిన వాళ్లకు చాలా విసుగ్గా అనిపిస్తోంది  అమ్మ మాటను వచనాల లక్ష్య పెట్టరు. దానితో ఆమెకు కోపం రావడం కేకలు వేయడంమామూలే  అలా కాకుండా  వారంలో ఒకరోజు ఆదివారం వరకు ఖాళీ  ఆ ఒక్క రోజు  వారికి ఏ పని చేయడం ఇష్టం ఆ పని చేయడం కోసం మీరు అంగీకారాన్ని తెలియజేయాలి  వాడు చేసే పని తప్పు గాని  చేయడం తెలియక పోవడం కానీ జరిగితే ఆ తప్పుని తప్పనిసరి చేసే బాధ్యత ఆమె తీసుకోవాలి  పిల్లగా మనసుకు నచ్చినట్లుగా వారికి ఈ విషయం మొత్తాన్ని చక్కగా చెప్పాలి  నీవు అనుకున్నట్లు చేయడం  వల్ల ఫలితం సరిగా ఉండదు అని నచ్చ చెబితే త్వరగా తప్పకుండా అంగీకరిస్తారు  దానితో తల్లిమీద గురుభావం ఏర్పడుతుంది. పిల్లలకు  ఇవాళ పల్లెలలో కూడా  ప్రవచన కార్యక్రమాలు నాటకాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తల్లి తండ్రి వారిని సెలవు రోజున తీసుకుని వెళ్లి  ప్రేక్షకులలో కూర్చోబెడితే  జీవన విధానం పిల్లలకు అర్థమవుతుంది  నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి  ఎదుటి వారు ఏవైనా  అల్లరి పనులు చేస్తుంటే  అది ఆ సమయంలో ఎంత నీచంగా ఉంటుందో వారి అర్ధమవుతుంది  ఈ కార్యక్రమాలకు వెళ్లడం వల్ల వారు చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నాటక ప్రదర్శన చూశారనుకోండి  దాని గురించి అతని అభిప్రాయం తెలుసుకుని అతను సరిగ్గా అర్థం చేసుకోక పోతే దానిని చూసి అర్థం చేసుకోవాలో తల్లిదండ్రులు చెప్పాలి. దాంతో ఆ నాటకం మీద అతనికి  సహజంగా కోరిక పుడుతుంది  అతను సాధన చేసి  మంచి గొప్ప నటుడు గా తయారు కావడానికి కూడా  అవకాశాలు ఉన్నాయి  అలాగే ఉపన్యాసాలు హరికథలు ఉన్నప్పుడు  వారు చెప్పినదానిని  పిల్లల మాటల్లో చెప్పమనడం వల్ల  ముందు జ్ఞాపక శక్తి పెరుగుతుంది  వారు చెప్పిన దానిని తాను ఒక కథలాగా ఎలా చెప్పగలడో  వ్రాయడం మీద  మనసు మళ్లి  చక్కటి సాహిత్య ప్రక్రియలను సృష్టించడానికి  తల్లి తండ్రి కారణభూతులు అవుతారు  నేను చెప్పిన దానిని ఆచరించి చూడండి దాని ఫలితం  ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది..... చేస్తారు కదూకామెంట్‌లు