తల్లి హక్కు;-డా.నీలం స్వాతి, చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు,6302811961.
 జీవితంలో ఒక మనిషికి ఒక అలవాటు ఉంటుంది  అది మంచిదా చెడ్డదా అనేది  చర్చించవలసిన విషయం కాదు అది అతని ఇష్టం.అతను నమ్ముతున్నాడు దానిని అనుసరించి  జీవించే హక్కు అతనికి తప్పకుండా ఉంటుంది ఈ సమాజంలో.  అయితే ఆ హక్కు ఎంత వరకు ఉండాలి అంతే దానికి  కొన్ని నియమాలు ఉన్నాయి.  నీవు చేసే పని వల్ల ఇతరులకు నష్టం కానీ, కష్టం కానీ  మానసిక క్షోభ కానీ కలగకూడదు అనేది  సమాజ న్యాయం. ఈ న్యాయం వేరు,  ధర్మం వేరు వాల్మీకి మహర్షి రచించిన ప్రతి వాక్యంలోనూ ధర్మం ప్రతిఫలిస్తూ ఉంటుంది. అది ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ వ్యక్తికైనా ఒకటి గానే ఉంటుంది కానీ వ్యాసమహర్షి వ్రాసిన  న్యాయవ్యవస్థ  ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది  ఒక దేశంలో ఉన్న నీతి మరొక దేశంలో ఉండదు  దేశంలోనే ఒక రాష్ట్రంలో ఉన్న న్యాయం వరకు రాష్ట్రంలో చెల్లదు. ఒక గ్రామంలో అవలంబిస్తున్న నియమాల్ని  మరో గ్రామంలో వారు అనుసరించవలసిన అవసరం లేదు. శాశ్వతమైనది ధర్మం అశాశ్వతమైనది న్యాయం  న్యాయాధికారి చెప్పినది  ధర్మమా న్యాయమా అని విశ్లేషిస్తే  న్యాయమే అవుతుంది తప్ప ధర్మం కాదు  అన్నది స్పష్టం. ఒక ఉదాహరణ తీసుకుంటే  ఇద్దరు స్త్రీలు కానీ ఇద్దరు పురుషులు కానీ వివాహం చేసుకోవడానికి న్యాయస్థానం అంగీకరిస్తుందా అంటే ఒక అధికారి న్యాయం చెబుతూ  రెండు మనసుల కలయిక వివాహానికి ముఖ్యం  వారిద్దరూ అంగీకరించినప్పుడు తప్పక వివాహం చేసుకోవాల్సిందే అని తీర్పు ఇస్తారు. వీరు న్యాయానికి బద్ధులై చెప్పిన మాట అదే విషయాన్ని తీసుకొని  మరో న్యాయాధిపతి ధర్మాన్ని చెబుతాడు. అసలు వివాహ వేదిక సహజీవనం చేయడం కోసం కామాన్ని తీసుకోవడం కోసమేనా కాదు కదా. వంశ వృక్షాన్ని పెంచడం కోసం ఏర్పడిన  వ్యవస్థ. మరి దానికి భిన్నంగా ఉండకూడదా ఈ వివాహం  మీకు  బిడ్డలను కనే  అధికారం ఉన్నప్పుడు తప్పకుండా వివాహం చేసుకోవచ్చు ఆ హామీ ఇస్తే  నేను అంగీకరిస్తాను లేకుంటే మీరు వివాహానికి అనర్హులు అని ప్రకటిస్తాడు అలా చెప్పడం వల్ల పూర్తి వ్యత్యాసం కనిపించడం లేదా. ఒకే పుస్తకాన్ని చదివిన మేధావులు  ఒకే విషయానికి రెండు తీర్పులనివ్వడం  సమంజసమా? తల్లులకు నేనొక సూచన చేయాలనుకుంటున్నాను.  పిల్లలను కొట్టకూడదు, తిట్టకూడదు లాంటివి ధర్మం  చంటి పిల్లల మనసును  బాధిస్తే  ప్రేమాభిమానాలకు దూరం అవుతారని పెద్దలు పెట్టిన నియమం. మరి తల్లి,  బిడ్డ తప్పు చేసినప్పుడు  నయానో భయానో లంచం ఇచ్చో చిన్నపాటి శిక్షను విధించి  మార్చడానికి ప్రయత్నిస్తే అది తప్పు అవుతుందా?  గారాం పెట్టి  బిడ్డను చెడగొట్టడం కన్నా  క్రమశిక్షణలో పెంచడం అమ్మ బాధ్యత కాదా  అన్నది నా ప్రశ్న. ధర్మాధర్మాలను న్యాయాన్యాయాలను వదిలి  బిడ్డ క్షేమం కోసమే కృషి చేసేది తల్లి. ఆమెకు పుట్టుకతోనే ఆ అధికారం వచ్చింది దాన్ని కాదనడానికి  ఏ న్యాయస్థానానికి అధికారం లేదు అన్నది నా స్థిర అభిప్రాయం. దానిని పాటిస్తే పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది అని నేను తలచి మీకు చెబుతున్నాను...



కామెంట్‌లు