కారుణ్యమూర్తి తల్లి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 దానధర్మాలకు పుట్టినిల్లు భారతదేశం సర్వేజనా సుఖినోభవంతు అన్న నినాదంతో తనలాగా ప్రతి ఒక్కరూ హాయిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే జాతి  భరతజాతి ఒక యాచకుడు వచ్చి బాబు ధర్మం చేయండి అంటాడు కానీ దానం చేయండి అనడు. అలా అనడానికి  కారణం తెలుసుకోవడానికి  ప్రయత్నిస్తే  ధర్మం చేయడం అనేది తన మనసుకు నచ్చిన ఆలోచనలో వున్న వ్యక్తి నిజాయితీగా అడుగుతున్నాడు అని ఆలోచించి తన స్తోమతను బట్టి కొంత  సహాయం చేస్తూ ఉంటాడు. దానం చేయడానికి అర్థం  ఒక దేవాలయానికి స్థలాన్ని దానం చేస్తాం. అక్కడ స్థలం ఉంది  దేవాలయం కట్టాలి అనుకుంటున్నాం అంటే ఆ దేవాలయానికి కొంత దానం ఇస్తారు. అత్యవసరంగా  అనుకోని ఆపదలో చిక్కుకున్న వారు ఎవరైనా కనిపిస్తే వారు అడగకముందే  కొంత ఆర్థిక సహాయం చేయడం.సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు  ప్రస్తుతం మనకు కనిపించకపోయినా దాన్నే అనుసరించిన వారు పూర్వ కాలంలో చాలామంది ఉన్నారు  మన పెద్దల కాలంలో ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే తనను  అతిథి గా భావించి  వారి ఇంట్లో ఏది ఉంటే అది పెట్టి అతనిని సంతృప్తిపరచడం ఆచారంగా ఉండేది. ఎవరూ లేక పోయినట్లయితే ఆ రోజు ఆ ఇంట్లో భోజనాలు కూడా ఉండవు. అంత నిష్టగా ఉంది  మన సమాజం. వీరిలో అభ్యాగతులు ఉంటారు.నేను మళ్ళీ వస్తాను అమ్మా మేము వచ్చినప్పుడు నాకు కావలసిన పదార్థాలు నాకు ఇష్టమైన పదార్థాలు నీవు చేసి పెడితే  నేను భోజనం చేసి వెళతాను అని చెప్పి తాను చెప్పిన సమయానికి వచ్చి ఆ గృహిణి చేసిన పదార్థాలను తిని  వెళ్లడానికి దారి ఖర్చులతో సహా వసూలు చేయడం అది అభ్యాగతుడి పని. భిక్ష స్వీకరించడానికి వచ్చిన వారి నుంచి  ధర్మాన్ని స్వీకరించి వెళ్లే వారి వరకు  ఆకలి మంటతో వచ్చిన వాళ్లే. ఆ మంటను చల్లార్చడానికి ఈ పదాలు వాడతాం. నిజానికి మన ధర్మాలు చెప్పేది నీకు ఉన్న దాంట్లో పొరుగు వాడికి కొంచెం సహకరించు అని. మనకు ఏం చేస్తున్నాం మనకు మిగలడం లేదు కదా ఇవ్వడానికి  మిగిలితే ఇద్దాం అనడం మానవాళికి ఆనవాయితీ అయింది. అలా కాకుండా నీకు ఉన్నదాంట్లోనే కొంచెం మిగిల్చి ఎదుటివారికి  నీ కడుపు మంట తీర్చుకోవడానికి ఎలా  ప్రయత్నం చేస్తున్నావు అతను కూడా అలాగే చేస్తూ ఉంటాడు అన్న విషయాన్ని గమనించి  అతనికి సహకారం అందిస్తే  అతను కూడా ప్రాణాలను నిలబెట్టే ఉంటాడు  అన్న విషయాన్ని తెలుసుకొని మానవతా దృష్టితో  దానం ధర్మం బిక్ష లాంటి పదాలు  వెలుగులోకి వచ్చాయి అనిపిస్తుంది నాకు. కనుక ప్రతి తల్లి తన బిడ్డను దయశీలిగా, కారుణ్య మూర్తిగా తయారు చేసే బిజాన్ని చిన్నతనంలోనే వేసి వారిని ఆ దృష్టి తోనే పెంచితే మీకు మీ వంశానికి పేరు ప్రతిష్టలు తెస్తాడు.


కామెంట్‌లు