నూతన వధువు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చిన్న పిల్లలు తల్లిదండ్రుల కారణంతో జీవితం చక్కగా హాయిగా కొనసాగుతుంది ఏ చీకూ చింతా లేకుండా కాలక్షేపం చేస్తున్న యువతి ఎవరినీ మాట అనకుండా ఎవరిచేతా మాట పడకుండా  ఎవరైనా మాట్లాడితే దానికి ప్రతిగా మాట చెబుతూ పెరిగిన అమ్మాయి పెళ్లయి అత్తారింటికి వచ్చిన తర్వాత ఆమె తత్వమే  పూర్తిగా మారిపోవడానికి కారణాలు  మనం అన్వేషిస్తే నాకైతే మనకు తెలిసే పాత్ర అమ్మ బిడ్డ అత్తారింటికి వెళ్లేటప్పుడు బిడ్డకు ఏం చెప్తుంది. నాన్నా ఇక్కడ ఈ జీవితం పూర్తిగా మర్చిపో, నీ భర్త చెప్పుచేతుల్లో జీవితాన్ని గడుపు. ఏ పరిస్థితుల్లోనూ భర్తకు ఎదురు చెప్పకూడదు ఆయన మనసుకు కష్టం కలిగేలా ఏ పని చేయకూడదు.  ఇక్కడ మమ్మల్ని ఎలా చూసుకున్నావో అక్కడ మీ అత్త మామ మరదులను ఆడ పడుచులను అలాగే చూసుకోవాలి వీటిలో ఏది చేయకపోయినా అది నీ జీవితం సర్వనాశనం కావడానికి అవకాశం ఉంటుంది  కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించమని తల్లి బోధిస్తుంది.
అత్తారింటికి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి  అందరి మనస్తత్వాలను పరిశీలించడానికి  కొంత సమయం పడుతుంది  ఏ ఒక్కరిని చూసినా అమ్మ చెప్పిన వాక్యం  మనసుకు వస్తుంది  ఆ మానసిక సంఘర్షణ అక్కడ చేసిన పనులు ఇక్కడ చెయ్యడానికి వీలు లేనివి ఎంతో ఘర్షణకు లోనవుతుంది ఆమె మనసు. ఆడపడుచులు  తన కన్నా వయసులో పెద్ద వాళ్ళు ఉంటారు చిన్న వాళ్ళు ఉంటారు ఎవరు ఏ క్షణాల ఎలా మాట్లాడుతారో ఊహించలేదు ఈ పిచ్చి తల్లి.  వాళ్లు మాట్లాడిన దానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో కూడా తెలియదు ఏ సమాధానం చెబితే వారు ఎలా అనుభూతి చెందుతారు  చెప్పిన దానిని సానుకూలంగా తీసుకుంటారో వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారో తెలియని సందిగ్ధావస్థలో ఆ యువతి తహతహలాడిపోతోంది  చివరకు మౌనాన్ని వహిస్తుంది.
తరువాత బిడ్డలు పుట్టి  ఆ బిడ్డ మిగిలిన వారికి భారం కాకుండా ఎవరికీ చీకాకు కలిగించకుండా జాగ్రత్తగా పెంచే బాధ్యత అమ్మదే కదా  బిడ్డకు ఎలా పెంచాలి వాళ్ళది తెలియని వయసు. చిన్నపిల్లలు ఏ నిమిషంలో ఎలా ఆడి పాడుతారో వాళ్లకు తెలియదు. జోల పాడి నిద్ర పుచ్చడం కూడా తెలియని స్థితి. ఎవరి సహాయం, సహకారం ఉండదు  ఏం చేయాలో తెలియని పసి మనసు. వంట చేసేటప్పుడు ఏ కూర ఎలా చేయాలో  పుట్టింట్లో ఉన్నప్పుడు అక్కడ రుచులు వేరు  ఇక్కడ ఎవరు ఎలా తింటారో అవగాహన లేదు  ఏ కొద్ది ఎక్కువ తక్కువలు వచ్చినా పేర్లు పెట్టి మానసికంగా ఆందోళన చెందవలసి వస్తోంది తిన్నగా ఆమెను  అనకపోయినా  చెట్టు పేరో పుట్ట పేరో చెప్పుకొని  పరోక్షంగా నిందలు వేయడం  ఎలా బారి. ఎవరికీ తెలియకుండా చాటుగా  దుఃఖంతో ఎన్ని రాత్రులు గడిపిందో ఎవరికీ తెలియదు.

సశేషం...


కామెంట్‌లు