పిల్లల తత్త్వం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు6302811961.
 పిల్లల భవిష్యత్ జీవితం  గౌరవప్రదంగా ఉండాలి అనుకునే ప్రతి తల్లి  తన బిడ్డను పెంచుతుంది. ఎంతో క్రమశిక్షణతో మనం మామూలుగా బజార్లో చూస్తూ ఉంటాము పిల్లల మాటలు. వీడు ఒక మాట అంటే వాడు మాటకు మాట అలా జరుగుతూనే ఉంటుంది. పలక రాని మాటలు కూడా పలికే  స్థితికి ఆ పిల్లలు వస్తారు ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నారు అంటే అది ప్రజల నుంచి  వారు పదాలను సృష్టించలేదు కదా పెద్దవాడు సృష్టించిన పదాలను వీరు వ్యాప్తిలోకి తీసుకొస్తారు అప్పుడు మనకు ఎలా ఉంటుంది వినడానికి బుద్ధిలేని వెధవా అని మనమే కోపగించుకుంటాము. మాటకు మాట తెగులు  నీటికి నాచు తెగులు అన్న వాక్యం మనకు తెలుసు అలాంటి తెగులును  ప్రారంభంలో తెంచి వేయకపోతే  అది వర్షంలో పెరిగినట్లుగా పెరిగి ఆ కుర్రవాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు.
ఆ దుస్థితి నుంచి  రక్షించగలిగిన ఏకైక వ్యక్తి అమ్మ. అమ్మకు అసాధ్యం అనేది ఏదీ ఉండదు  ఎవరైనా పొరపాటు మాటలు మాట్లాడినప్పుడు  మీరు మౌనంగా ఉండండి అని పిల్లలకు నేర్పేది అమ్మ. కొంతమంది  డబ్బు కలిగిన వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు  ఉన్న వారి పద్ధతి వారి బట్టలు  వారి వస్తువులు  వారి వాహనాలు అన్నీ ఖరీదైనవి స్తోమత ఉన్నది కనుక వారు వాటిని  వాడుతున్నారు. సోమత లేని పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్లి వాడు ఫలానాది తీసుకున్నాడు నాకు ఇవ్వవా అని అడిగితే  ఆ తల్లి పరిస్థితి ఏమిటి  ముందు నిర్ఘాంత పోతుంది  కాళ్లు చేతులు ఆడవు  అలాంటి స్థితిని  కర్ణుని కన్న తల్లి నీటిలో వదిలినప్పుడు  కుంతీదేవి  పరిస్థితి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అట్టే నిర్ఘాంతపోయి నిశ్చల నిరీషా  నీరస ద్రుకూలై  అని వర్ణించాడు  అంతకుమించిన పదాలను మరెవరైనా వాడగలరా  ఆ స్థితిని అనుభవించిన వారికి ఆ పదాలు వస్తాయి.

ఏ బిడ్డ కైనా  వ్యతిరేక సమాధానం వస్తే  భరించలేదు చాలా చీకాకు పడతాడు  అమ్మ మీద కోప పడతాడు  అందుకు అమ్మ  చాలా సున్నితంగా  అలాగే నాన్న తప్పకుండా కొందువు గాని  ప్రస్తుతం ఉన్న దానితో సరి పుచ్చుకో  నేను నాన్న గారితో చెప్పి అన్ని ఏర్పాటు చేస్తాను  నీకు ఏది కావాలంటే అది తీసుకుందువు గాని బాబు  అని సమర్థిస్తూ చెపితే ఆ బిడ్డ ఎంత ఆనందిస్తుంది. అలా ఆ వస్తువు తన చేతికి అందినట్టే ఊహించుకుంటుంది   అలాంటి స్థితిని కలిగించేది అమ్మ మాత్రమే  వీరి పరిస్థితి చక్కబడిన తరువాత  బిడ్డ కోర్కెలను తల్లిదండ్రులు తీరుస్తాడు. ఎవరికి మాత్రం నిజం నీ మీద ప్రేమ ఉండదు. తన బిడ్డ కూడా అన్ని సుఖాలు అనుభవించాలనే కదా రెక్కలు ముక్కలు చేసుకొని కాయకష్టం చేసి  వారి కోసం కూడపెట్టేది  అమ్మ ఆలోచనలు  క్రమపద్ధతిలో  ఉంటే  ఆ సంసారం  ఎంతో ఉన్నత స్థితికి వస్తుంది అని నేను మాట్లాడడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రతి తల్లికి  ఆ ఓర్పు  సహనం ఉంది అని నా గట్టి నమ్మకం  ఏ తల్లీ నా నమ్మకాన్ని  వమ్ము చెయ్యదు...చెయ్యలేదు కూడా....

కామెంట్‌లు