ఫ్రిడ్జ్ వాటర్ వద్దు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 టెక్నాలజీ బాగా పెరిగాక మనిషి శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది అన్న విషయం అందరికీ తెలిసినదే. ఏ ఇంట్లో చూసినా ఎలక్ట్రానిక్ వస్తువులే కనిపిస్తాయి మనకు.
లగ్జరీ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయాం కనుక పాతకాలపు అలవాట్లును పూర్తిగా విడిచి పెట్టేసాం. అందుకే మన ఇళ్లల్లో రోళ్లు రోకళ్లు కనిపించవు ఓన్లీ మిక్సీలే కనిపిస్తాయి. 
కుండలు కనిపించవు ఫ్రిడ్జ్ లు కనిపిస్తాయి. ఏంటి మెల్లగా
మమ్మల్ని  తిట్టేస్తుందనుకుంటున్నారా ? 
అయ్యో లేదండి... డాక్టర్ ని కదా అందుకే విషయాన్ని అర్థమయ్యేలా వివరిస్తున్నాను అంతే.... ఈ ఎలక్ట్రానిక్స్ గురించి అంతా మనకెందుకు కానీ ఫ్రిడ్జ్ విషయానికొద్దాం. చిన్నపిల్లలు ఫ్రిజ్ వాటరే కావాలని మారాం చేస్తారు ఎందుకంటారు ఆ వాటర్ చాలా చల్లగా ఉంటుంది కనుక వాళ్లకి అలా తాగాలనిపిస్తుంది.
అందుకే ఫ్రిడ్జ్ డోర్ తీసి మెల్లగా వాళ్ల చిట్టి పొట్టి చేతులతో వాటర్ బాటిల్ మూత తీసుకొని ఎవరూ చూడకుండా తాగేస్తుంటారు. అవి వద్దమ్మా ఇవి తాగు అంటూ మనం మామూలు నీళ్లను ఇచ్చినా అవి తాగరు కదా బాటిల్ వైపు చూపించి అవే కావాలంటూ మారాం చేస్తారు.
అయితే పిల్లలు ఫ్రిడ్జ్ వాటర్ తాగవచ్చా అంటే. పిల్లలకు ఫ్రిడ్జ్ వాటర్ తాగించడం ఎంత మాత్రం మంచిది కాదు.
ఈ వాటర్ ను తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వస్తుంది. ఊపిరి తిత్తుల్లో నిమ్ము చేరుతుంది దాంతో
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు రాత్రంతా నిద్ర పోలేరు దాంతో ఎంతో చికాకుగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులకు చింతను కలిగిస్తారు. అయితే ఎలా అండి మాన్పించడం ఫ్రిజ్ నీళ్లు కానీ ఇవ్వకపోతే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తారు. ఏం చేయాలి అంటే... పిల్లలకు చల్లని వస్తువులు అంటే చాలా ఇష్టం అందుకే ఐస్ క్రీమ్ లను, ఫ్రిజ్ లోని వస్తువులను కావాలని అల్లరి చేస్తారు. పిల్లలను మానిపించడం ఎలా అంటే కష్టమే... కానీ మానాల్సింది ముందు పిల్లలు కాదు తల్లిదండ్రులు. మీరు ఫ్రిజ్లో నీరు తాగుతూ పిల్లలకు మామూలు నీళ్ళు ఇస్తే వాళ్ళు తాగుతారా నువ్వు అది తాగుతున్నావ్ నాకు అదే కావాలి అంటూ గొడవ పెడతారు. కనుక ముందు మీరు మానేయండి. పిల్లలకు అనారోగ్యం వస్తే అంతగా తల్లడిల్లి పోతారే వారికోసం మీ చిన్ని అలవాట్లను మార్చుకోలేరా. ఎప్పుడూ దండించి పిల్లలని మార్చాలా ఏం మీరు మారితే తప్పేముంది. వేసవి కాలంలో తాపం ఎక్కువగా ఉంటుంది కనుక చల్లని నీరు త్రాగాలనిపిస్తే మట్టికుండను ఇంట్లో ఉంచండి. అందులో నీటిని పిల్లలకు తాగించండి మీరు త్రాగండి. ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. ఈ ఆధునిక గ్యాడ్జెట్స్ వల్ల ఉపయోగాలతో పాటు నిరుపయోగాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్న విషయం మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకోండి. నేను చెప్పే మాటలను సూచనలుగా గ్రహిస్తారని, పాటిస్తారని  అనుకుంటున్నాను... ముందు మనం మారి పిల్లల్ని మార్చడం సరైన పద్ధతి.... మరి ముందు మీరు మారుతారు కదా... ఓకేకామెంట్‌లు