తెలివైన పిల్ల;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చిన్నపిల్లల పలుకులు ఎంత అందంగా ఉంటాయో వారు చేసే పనులు ఎంత చిలిపిగా ఉన్నా  పెద్దలకు ఆనందాన్ని కలుగ చేస్తూ ఉంటాయి. వారు ఏ పని చేసినా మీరు గమనించండి అంతకుముందు ఆ పనిని పెద్దవారు ఎలా చేశారో  ఆ పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. పూర్తిగా దాన్లో సఫరికృతం కావచ్చు  కాకపోవచ్చు ప్రయత్నం  మాత్రం మానరు. మా పిల్లలకు మొన్న దీపావళి రోజున వాళ్లు కోరిన మందు గుండు సామాన్లు అన్నిటిని తెప్పించి  వీటిని ఇలా వాడాలి  వేరే రకంగా వాడితే  ఆ నిప్పురవ్వలు బట్టల మీద పడతాయి  ఆ బట్టలు చిల్లులు పడతాయి  ఆ రవ్వలు శరీరం మీద పడితే కాలి తరువాత బొబ్బలు పొక్కుతాయి అని నేను ఎంతో చక్కగా చెప్పినప్పుడు ప్రతిదానికి తలకాయలు ఊపి  అలాగేనమ్మా నువ్వు చేసినట్లు చేస్తాం అంటారు ఆనందంగా.  అంతా పూర్తిగా వాళ్లకు అర్ధమైనట్లుగా  మాట్లాడతారు.
చివరికి కాల్చడం ప్రారంభించిన తర్వాత  వారి మనసు వాళ్ల స్వాధీనంలో ఉండదు  అన్న చెర్రీ కాల్చినట్లుగా కాల్చడం కోసం సిరి తల్లి ప్రయత్నం చేస్తుంది  చెర్రీ వాడి స్నేహితుడు వీడు కన్నా బాగా చేయడం చూసి వాడికన్నా బాగా చేయాలని ఇంకొంచెం ఎక్కువ మోతాదులో చేస్తాడు.  ఇలా పండగ ఎంతో ఆనందంగా అద్వితీయంగా జరుగుతూ ఉంటుంది.  మధ్యలో సిరితల్లి  బ్యార్ బారుమంటూ ఏడ్చుకుంటూ రావడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఎంతో కుతూహలంగా బాణాసంచా కారిస్తున్న పిల్ల ఎందుకు ఏడుస్తుంది  చేతులు కాలయా అని ఆలోచిస్తే దగ్గరికి వచ్చి  అమ్మ చేయి కాలింది చూడు అని ఆ బొబ్బ చూపిస్తూ ఏడుస్తుంది  ఏమిటమ్మా అన్నయ్య కాల్చాడా? ఇంకెవరైనా కాల్చారా  అని అడిగితే లేదమ్మా నేనే కాల్చుకున్న అన్నప్పుడు ఆ తల్లి  ఆనందించాలా? దుఃఖించాలా?  నవ్వితే ఆ పాపకు కోపం వస్తుంది  ఆ నవ్వుని తనలోనే  అణచుకుంటుంది అమ్మ.
ఆ రాత్రి అంతా పాపకు  పరిచర్యలు చేయడంతోనే సరిపోతుందా అమ్మకు. నిద్ర కూడా పట్టలేదు. నాకు నొప్పిగా ఉంటే అలా చూస్తావేం  ఉఫ్ ఉఫ్ అంటూ వుదొచ్చుగా అని గదమాయిస్తుంది ఆ పాప అలాగేనమ్మా అని తను చెప్పినట్టే చేస్తూ  పాపను నిద్రపుచ్చేసరికి  తల ప్రాణం తోక కోస్తుంది  తెల్లవారు లేచేసరికి కొంచెం  నొప్పి తగ్గి  మామూలు స్థితికి వస్తుంది. స్థానసంధ్యలు పూర్తిచేసి  కడుపునిండా రాత్రి మిగిలిపోయిన పదార్థాలను  తిని పుస్తకాలని సరిచూసుకొని బడికి బయలుదేరుతుంది  ఏంట్రా బడికెడుతున్నావ్  తగ్గిందా అని అడిగితే తగ్గిందిలే అని సమాధానం.  మరి నొప్పి ఎలా ఉంది  పూర్తిగా తగ్గిందా ఇంకా కొంచెం ఉందా అని అడిగితే  కొంచెం నొప్పిగానే ఉందిలే  అయినా నేను బడికెడుతున్న  లేకపోతే ఇవాళ మేడం చెప్పిన పాఠం  రేపు నాకు ఎలా తెలుస్తుంది అని ఎదురు ప్రశ్నా ఆ పాప మాటలు విని తాను ఎలాంటి ఆనందం అనిపిస్తుందో మాటల్లో చెప్పగలమా అది పాప అమ్మల సంబంధం.కామెంట్‌లు