భగవన్నామ స్మరణ;-"రసస్రవంతి " & "కావ్యసుధ "7075505464: 9247313488హయత్ నగర్ : హైదరాబాద్
 కృతయుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్ఞానానికి, ద్వాపరయుగంలో భగవన్నామ సంకీర్తనకు ప్రాధాన్యమని పరాశర మహర్షి వాక్కు. భగవన్నామం భక్తి స్వరూపమే. భక్తిలో ఉన్నంత శక్తి నామంలో ఉంది. నిరంతరం భగవన్నాను స్మరణ చేస్తుంటే ఆయన కరుణాకటాక్షాలు మనపై ప్రవరిస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భగవన్నామమే పరమ ధర్మం. ఆయన నామమే పరమ తపస్సు, ఆయన నామమే లోకాలకు గతి. నామం ఏదైనా కావచ్చు. కానీ, ప్రతి నామంశక్తి వంతమైనదే. ప్రతి నామంలో అపారమైన అమృతం నిండి ఉంది. అందుకే మనం ఎన్నిసార్లు భగవంతుని నామాన్ని జపించినప్పటికీ అలుపు రాదు , ఆర్తి తీరదు. అదొక తీరని దాహం.
భగవంతుని నామం కల్పవృక్షం వంటిది. అది మన కోరికలను తీర్చి, జనన మరణ బంధాల నుండి విముక్తి కలిగిస్తుంది. భగవ -న్నామం జపం చేసిన వారికి అందుకోలేనిదేమి లేదు. వారికి అన్నీ సుసాధ్యాలే, వారు చేపట్టిన పనులన్నింటిలో విజయమే. నామస్మరణ మహత్తును గురించి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే గీతలో ప్రస్తావించాడు.
అంతకాలే చ మామేవ స్మరమ్మత్వా కళేబరమ్ యఃప్రయాతి సమద్భావం యాతి నానృత సంశయః ఎవరు మరణ సమయంలో కూడ నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడుస్తారో, వారు నా స్వరూపాన్నే పొందుతారు. ఈ విషయంలో సందేహం లేదు...
ఇందుకు అజామిళుని కథ చక్కని ఉదాహరణ. పూర్వం కన్యాకుబ్జంలో అజామిళుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతను ఓ వనితతో సాంగత్యం పెంచుకుని స్వధర్మాన్ని వదలి సంచరించ సాగాడు. అతను చేసే పాపకృత్యాలకు అంతే లేకుండా పోయింది. ఆ పనితకు అజామిళుని వల్ల పదిమంది పిల్లలు పుట్టారు. వారిలో చివరివాని పేరు నారాయణ. అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భార్యను వదిలేసి అడవిలో పరిచయమైన స్త్రీతో కాపురం చేసి, పదిమంది. పిల్లలకు తండ్రి అయ్యాడు. కుటుంబం పెద్దదవడంతో వారిని పోషించడం కష్టమైంది. ఒళ్ళు వంచి పనిచేయడం ఎప్పుడో మరచిపోయిన అజామిళుడు దారిన వచ్చే పోయే బాట పారులను దోచుకోసాగారు. దోచుకోవడమే కాక వారిని చిత్రహింసలకు గురిచేసేవాడు.
ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన పిదప వృద్ధుడైన ఆమినని మాృత్యువు సమీపించింది. అనపాన సమ యంలో తనకు ఇష్టమైన చిన్న కొడుకుని ... నారాయణ..... నారాయణ.....అన్ని పిలిచాడు. సరిగ్గా ఆ సమయానికి అతన్ని తీసుకుపోయేందుకు యమదూతలు వచ్చారు. అదే సమయంలో 'నారాయణ' స్మరణ విన్నందున విష్ణు దూతలు కూడ వచ్చారు. విష్ణుదూతలు యువదూతలను అడ్డగించి, అతనికి వైకుంఠనికి  తీసుకుపోయారు. ఆమిళుడు బుద్ధిపూర్వకంగా భగవన్నామ స్మరణ చేయక పోయినప్పటికీ, అవసాన సమయంలో స్వామి నామాన్ని పలికినందున అతనికి వైకుంఠప్రాప్తి కలిగింది...
భగవన్నామంలో ఇంతటి మహిమ ఉండబటే,నారదాది మునులు భగవన్నామాన్ని నిరంతరం స్మరిస్తూ చరితార్థులయ్యాడు. అయితే కొంతమందికి ఓ పందేవాం కలుగవచ్చు. త్రిమూర్తులలో ఎవరి నామాన్ని జపించాలన్నదే ఆ సందేహం.
త్రిమూర్తులు ఒకే భగవదంశకు చెందిన వేరు వేరు రూపాలు. సృష్టి చేసే ఉద్దేశ్యంతో బ్రహ్మగా, స్థితిచేసే ఉద్దేశ్యంతో విష్ణువుగా, సంహారం చేసే ఉద్దేశ్యంతో రుద్రుడయ్యాడని శివపురాణం పేర్కొంది..

కామెంట్‌లు