రేపటి భారత పౌరులు;(బాల గేయం :)-నెల్లుట్ల సునీత(శ్రీ రామ)-ఖమ్మం-7989460657
బాలలమ్మ బాలలు!
 భవితకు వారే రూపాలు!

వేకువ జామునే లేచారు
 హారతి ప్రేమగా పట్టారు

అమ్మకు పనిలో
 సాయం చేసి 
రంగవల్లులు వేశారు

అభ్యంగన స్నానం చేసి
కొత్త బట్టలు వేసుకొని
దేవునికి దండం పెట్టుకొని
మురిపంతో మురిసారు

స్నేహితుల్ని కలిశారు
శుభాకాంక్షలు తెలిపారు
మిఠాయిలన్నీ పంచారు
మతాబులన్నీ కాల్చారు


రాకెట్లన్నీ పేల్చారు
 తారాజువ్వలు అయినారు
ఆశల దీపం వెలిగించి
 రేపటి భవితను చాటారు

అందరి మెప్పు పొందారు
ఆదర్శంగా మెరిసారు
 ఆనందాలు పంచారు
భువిలో దివ్వెలు అయ్యారు.

బాలలమ్మ బాలలు
 రేపటి భారత పౌరులుకామెంట్‌లు