అహంకారం;- సీఎచ్. అఖిలేష్8వ తరగతి A సెక్షన్జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలసెల్ ;: 9440366991.

 అనగనగా ఒక ఊరిలో ఒక బీదవాడు ఉండేవాడు. అతను ఒకరోజు  ఆకలితో కండ్లు తిరిగి కింద పడతాడు. దేవుడు పాపం అని ఒక బంగారు గుడ్డు పెట్టే కోడి ఇస్తాడు. అప్పుడు ఆ బీదవాడు కోడి గుడ్లు అమ్ముతూ కోటీశ్వరుడు అవుతాడు పెళ్లి చేసుకుని ఇద్దరు  పిల్లలతో సంతోషంగా ఉంటాడు. కోటీశ్వరుడు అయినందుకు అహంకారంతో ఉంటాడు. అప్పుడు దేవుడు ఒకసారి సాధువు రూపంలో  వచ్చి  పరీక్షిస్తాడు. భవతి భిక్షం దేహి అని అడిగినప్పుడు. ఆ బీదవాడు ఏమీ లేవు వెళ్ళిపో అంటాడు. అంత సంపద ఉంది కదా. ఆకలితో ఉన్నాను కడుపు నిండడానికి ఏమైనా ఇవ్వండి అని అడుగుతాడు. నా దగ్గర ఏమీ లేవు వెళ్ళిపో ఉంటాడు బీదవాడు. అప్పుడు దేవుడు  రూపంలో నుంచి దేవునిగా మారి మూర్ఖుడా కానీ లేదు అని అంటావా లేదు అన్నావు కదా లేకుండా ఎందుకని శపిస్తారు దేవుడు. అప్పుడు బీదవాడు సంపద అంతా కోల్పోయి బీదవాడిగా ఉంటాడు .
నీతి: మన దగ్గర ఏమి ఉన్నా లేకున్నా ఓకే లాగా ఉండాలి. గర్వం ఎందుకు పనికిరాదు. మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది.

కామెంట్‌లు