*నమ్మకద్రోహం *;-డి అభిషేక్ రెడ్డి;- తరగతి 8వ ఏ సెక్షన్-జడ్పీ హెచ్ ఎస్ ఇందిరానగర్, సిద్దిపేట..-సెల్ నెంబర్:9704105200
 ఒకానొక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ల పేర్లు రామ్, లక్ష్మణ్. ఒక స్నేహితుడి కేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఇంకో స్నేహితుడికేమో హార్డ్వేర్ ఉద్యోగం. వీళ్ళిద్దరూ చిన్నప్పటినుండి చాలా కలిసిమెలిసి ఉండేవారు. కొన్ని సంవత్సరాలు తర్వాత హార్డ్వేర్ చేసే స్నేహితుడు వెళ్తాడు. సాఫ్ట్వేర్ చేసి స్నేహితుడికి  పై ఉద్యోగం రావడంతో పట్టణానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళజీవితాన్ని సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత  ఇద్దరు స్నేహితులు వాళ్ళ సొంత ఊరికి. వాళ్ల ఉద్యోగానికి  సెలవు వచ్చింది. అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. సాఫ్ట్వేర్ చేసే స్నేహితుడు, హార్డ్వేర్ చేసే స్నేహితుడిని చులకనగా చూసేవాడు అయినా ఆ మాటలను హార్డ్వేర్ చేసే స్నేహితుడు పట్టించుకోడు. అలా వాళ్ళ స్నేహం కొంతకాలం అలాగే కొనసాగింది. ఒకరోజు సాఫ్ట్వేర్ చేసే స్నేహితుడు అలాగనే వెటకారంతో మాట్లాడుతూ ఉండేవాడు. హార్డ్వేర్ చేసే స్నేహితుడు తన బాధలను సాఫ్ట్వేర్ చేసే స్నేహితుడికి చెప్పుకుంటాడు. ఈ విషయాలు మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. మళ్లీ మూడో వ్యక్తికి తెలువద్దు. ఈ విషయాలు చేసే  కావాలని హార్డ్వేర్ చేసే స్నేహితుడి చెప్పిన విషయాలు అన్నీ సాఫ్ట్వేర్ చేసే స్నేహితులు వేరే వాళ్ళందరికీ చెబుతాడు. హార్డ్వేర్ చేసే స్నేహితుడికి కోపం వచ్చి తనతో స్నేహం చేయడం వద్దనుకొని వదిలేస్తాడు.


 నీతి: చెడు స్నేహం వద్దనుకుంటే వాళ్లకు దూరంగా ఉండడమే మంచిది. మంచి స్నేహం కావాలనుకుంటే వాళ్లతో మర్యాదగా కలిసిమెలిసి నమ్మకంగా ఉండాలి.

కామెంట్‌లు