*వర్ణన*; -మమత ఐల--హైదరాబాద్9247593432
 అంశం:-*కుక్కను గరించి*
ఉ.
ఎక్కువ బెట్టకున్నగని యింటిని చక్కగ కాపుగాయునే
తక్కువ యేమిగాదు శివతాండవ మాడగ దొంగజేరినన్
మక్కువతోడ వానిగని మంచిగ దీయగబోవుపిక్కలన్
గ్రక్కున పారిపోవుగద గాంచిన కుక్కయె వెంబడించగన్
*శునక వర్ణన*
తే.గీ
శునకమహరాజు విశ్వాస ఘనతతోడ
సైనికుని వోలె రక్షించు స్వగృహమని
కూర్మి జూపించు చక్కని గుణము చేత
బుక్కెడన్నంబు బెట్టగా నిక్కముగను

కామెంట్‌లు