నడక-సృజనాత్మకత;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  మీరు ఒక రచయిత అయినా,ఒక చిత్రకారుడైనా మరే కళలో అయినా ప్రవేశముంటే ఒక రూములో కూర్చుని మీ పని మీరు చేసుకుంటూ పోతే ఆ పని మామూలుగా అలా జరిగి పోతుంటుంది. అదే ప్రకృతిలోనో పార్కులోనో నడుస్తూ మీ కళను గురించి ఆలోచిస్తే మీ సృజనాత్మకత మరింత మెరుగు పడుతుంది.ఈ విషయంలో సందేహం లేదు! నాకు కూడా అనేక కథలకు, వ్యసాలకు ఆలోచనలు నేను నడుస్తున్నపుడు, ఓ పచ్చని చెట్టును చూసినప్పుడు, ఓ పిట్ట పాట వింటున్నప్పుడు అనేక సృజనాత్మక ఆలోచనలు పుట్టుకొచ్చాయి!
        నడక శారీరక ఆరోగ్యానికే కాదు మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
       ఆంగ్ల నవలా రచయిత ఛార్లెస్ డికెన్స్ కూడా నడకలోనే బోలెడు ఆలోచనలు తనకు వచ్చినట్టు వ్రాసుకున్నాడు.అమెరికా మూడవ అధ్యక్షుడు థామస్ జెఫర్ సన్ కూడా నడకలోనే తనకు సృజనాత్మకత ఆలోచనలు వచ్చినట్టు తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నాడు.ఫ్రెడిరిచ్ నిస్ట్ జె తన నడకలోనే అనేక ఆలోచనలు వచ్చినట్టు చెప్పుకున్నాడు.ఈయన తత్త్వవేత్త.
   అమెరికాలోని స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం నడవని వారితే పోలిస్తే నడిచే వారిలో 81శాతం సృజనాత్మకత ఎక్కువ!
   అమెరికా రచయిత కర్ట్ వానెగట్ (1922-1907) రోజూ పొద్దున్నే బాగా నడచి, ఈతకొట్టి వచ్చి తన రచనా కార్యక్రమం మొదలు పెట్టేవాడు.ఈయన 14 నవలలు, అనేక నాటికలు, 3 కథా సంపుటాలు ప్రచురించాడు.
    జపానులో ప్రభుత్వం 'షిన్రిన్ యోకు' అనే ప్రక్రియను ప్రోత్సహిస్తున్నది.దీని అర్థం ప్రకృతిలో నడవండి సృజనాత్మక జీవితం గడపండి అని అర్థం.అందుకే జపనీయులు అనేక నూతన ఆవిష్కరణలు,సృజనాత్మక రచనలు చేయగలుగుతున్నారు! దీనికి మరొక పేరు అక్కడ ' అడవి స్నానం(forest bathing)ఈ ప్రక్రియను 1982లో అభివృద్ధి చేసారు.
        మీ ఫోన్ ఆపేసి ప్రకృతిలో మమేకమై నడవండి,  చెట్లు మాట్లాడే భాషను, పక్షుల కిలకిల రావాల్ని వింటూ సృజాత్మకతకు పదును పెట్టండి.
           *******         ******

కామెంట్‌లు