నేడు డాక్టర్ ఏపీజే అబ్దల్ కలాం జయంతి శుభాకాంక్షలతో==========================================1.ఆయన మిసైల్ ల శాస్త్రవేత్త!అద్భుత గ్రంథాల రచయిత!ఆధునిక కాలాన తత్వవేత్త!జీవితాన్నిఎరిగిన ప్రజ్ఞాశీలత !వ్యక్తిత్వవికాసాన ఓ అనన్యత!2. పేదరికాన పుట్టిన,ప్రతిభా పారిజాతంస్వయంకృషితో,విజయ సోపానం !దేశానికి ,ప్రథమ పౌరునిగా,అలంకృతం !పేరులో ఫకీర్,జ్ఞానానికిఅతడు సాటిలేని అమీర్!కలాం పేరు చెబితే,మానవజాతి శ్రద్ధతో సలాం!3. కలలు కనాలి,కన్న కలలు నిజం చేయాలి!పరిపూర్ణత లక్ష్యమే కాదు,జీవన ప్రయాణం కావాలి!యువత భవిత ,ఆయన సుందర స్వప్నం!యువత ఆ స్వర్గం,భూమ్మీద నిర్మించాలి!రామేశ్వరాన ఆయన,జాతీయ జ్ఞాపక కట్టడం!మనమంతా దర్శించి,తరించి,ఆయన మార్గం,అనుసరించాలి!________
మామూలు జీవనం మహోన్నత ఆశయం!,;జ్;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి