చిలకమ్మ;-రావిపల్లి వాసుదేవరావు--పార్వతీపురం--9441713136
మాటలు నేర్చే చిలకమ్మా
పాటలు పాడే చిలకమ్మా
మాటలు నేర్చీ పాటలు పాడీ
ఆనందాన్ని పంచమ్మా

నవ్వులు రువ్వే చిలకమ్మా
కవ్వించేటి చిలకమ్మా
నవ్వులు రువ్వీ కవ్వించేటి
గువ్వల నేస్తం నువ్వమ్మా

ముద్దుల మోము చిలకమ్మా
ముచ్చట గొలిపే చిలకమ్మా
ముద్దుమోముతో ముచ్చట గొలిపీ
మురిపెం మాకు పంచమ్మా

కబుర్ల పోగు చిలకమ్మా
చెలిమిని చేసే చిలకమ్మా
చెలిమిని చేసే కబుర్లపోగు
కథలను చెప్పీ పోవమ్మాకామెంట్‌లు