మూర్ఖుడు- మూఢుడు;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,94928 11322
 మానవ ప్రవృత్తిని  రెండు రకాలుగా విభజించారు మన పెద్దలు. మూర్ఖుడు అన్నాడు వేమన, మూఢుడు అన్నాడు శంకరాచార్య  పునరపి మరణం పునరపి జననం మూఢమతే  అన్నది  శంకరాచార్య చెప్పినది. ఏ మతమైన  జీవి పుట్టడం, పెరగడం, మరణించడం తిరిగి పుట్టడం పెరగడం మళ్ళీ మరణించడం. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది అని వారు చెప్పారు మూర్ఖుడు  చాలా ఘోరంగా ఉంటాడు.  మూర్ఖుడు ఏది చెప్పిన అతనిని  మార్చలేము  అన్న అర్థంలో వేమన చెప్పాడు.  అసలు ఎవరు మూర్ఖులు  తా పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటారు మూర్ఖులు  వారి వాదన వారికి  వీరి వాదన వీరికి ఉండడం సహజం. మనం చూస్తున్న ప్రతి కుందేటికి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా మరి దీనికి మూడు కాళ్లు ఏమిట  నీవు చెప్పింది తప్పు అంటే  కాదురా మూర్ఖుడా కుందేటికి   నాలుగు కాళ్ళు ఉంటాయి అనేది జగద్విదితం.అది  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేనేమి అంటున్నాను నేను పట్టిన కుందేటికి అని స్పష్టంగా చెబుతున్నాను. నేను ఒక కాలు నా చేతితో పట్టుకొని నీ వైపు చూపిస్తూ నేను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని చెబుతున్నాను  ఇది తప్పా ఒప్పా అని వాదిస్తాడు. తాను నమ్మి ఒక నిర్ణయాన్ని తీసుకున్న తరువాత బ్రహ్మ రుద్రుడు చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోని వాడిని మూర్ఖుడు అంటారు. శంకరాచార్య చెప్పిన మూఢత్వం ఎలా ఉంటుందంటే తాను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు  అతనికి దాని మీద కొన్ని సందేహాలు ఉంటాయి అది చేయవచ్చునా చేయకూడదా  అన్న మీమాంస బయలుదేరుతుంది,  అప్పుడు పెద్దల సలహా తీసుకుంటాడు  వారు చెప్పింది చేయడానికి అంగీకరిస్తాడు. అతనిని మూఢుడు అంటున్నాం
కనుక ఇద్దరి వాదనలను వారి దృష్టితో  అంగీకరించవలసి నదే కానీ లోక దృష్టితో వేమన చెప్పినది  మూర్ఖుల మనసు రంజింప చేయలేము అని. మరి వారి మాటలు కాదనగలమా?

"తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు..."కామెంట్‌లు