చౌర్యం;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,94928 11322


 ఏదైనా ఒక విషయాన్ని  ఇతరుల దగ్గర దొంగిలించి తన సొంత వాక్యంలో ప్రాచుర్యం చేయడం చాలా గొప్ప విశేషం. ఓ రోజు ఉష శ్రీ గారి గదిలో కూర్చున్నాం  పెద్దవారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా ఉన్నారు.  తిరుపతి వెంకట కవులు నుంచి విశ్వనాథ్ వరకు ఉన్న కవుల నిజజీవిత సంఘటనలు విశ్లేషించుకుంటూ హాయిగా నవ్వుకుంటున్నాం. ఆ నవ్వుల సందర్భంలో ఉషశ్రీ గారు ఇలా నవ్వడం ఒక భోగం అయ్యాడు, నవ్వడం సరే నవ్వించడం ఒక యోగం కాదా అన్నాడు సుమన్. మీ యోగాలు బోగాలెమో కానీ నాలాంటి వాళ్ళు నవ్వించినా నవ్వలేక పోవడం అదొక పెద్ద రోగం అని కవ్వించారు నండూరి సుబ్బారావు గారు. ఆ సందర్భంలో జంధ్యాల అక్కడే ఉన్నాడు. అతన్ని శాస్త్రి అని పిలుస్తాం మేమంతా కాలేజీ నుంచి.  జంధ్యాల ఉష శ్రీ గారితో ఇది నాకు బాగా నచ్చిందండి దీనిని నేను సొంతం చేసుకోనా అని అడిగితే బాబు చెప్పకుండా అనేకమంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. నువ్వు చెప్పి చేస్తున్నావ్ చాలా ఆనందం చేసుకోపో అన్నాడు. అప్పటి నుంచి  సినిమా ద్వారా దానిని  విస్తృత ప్రచారం చేశాడు. అది అతని ప్రత్యేకత.


కామెంట్‌లు