వరం....శాపం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భగవంతుడు  భక్తులకు ఇచ్చేది వరం  రాక్షసులకు ఇచ్చేది  శాపం  భక్తులకు  మంచి జరగాలని రాక్షసులకు చెడు జరగాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు  మరి మనుషులకు ఈ గుణం లేదా? ఎవరు ఎవరికీ వరాలు ఇవ్వడం కానీ శాపాలు పెట్టడం కానీ ఉండదా  అహం బ్రహ్మాస్మి ఉన్నప్పుడు నేనే భగవత్స్వరూపం అయినప్పుడు వారి గుణ గణలు ఎందుకు ఉండదు  ఒక పదార్థం ఒక ప్రాంతంలో ఉన్నా వీరు ఒక ప్రాంతంలో ఉన్నా ఆ పదార్థాలలో ఉన్న గుణాలు మారవు కదా  మరి మనుషులకు ఎందుకు  ఆ శక్తి లేదు అని ప్రశ్నించే వాళ్లకు  ఉన్నది అని చెప్పడమే వేమన ఉద్దేశ్యం. నిన్ను నీవు తెలుసుకున్న తరువాత  నీకు ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియదా?  కొంతమంది ద్వారా మనం వింటూ ఉంటాం  విశ్వనాథ సత్యనారాయణ గారు ఎదుటివారిని తెగడిన,  పొగిడిన అది జరిగి తీరుతుంది అని. విశ్వనాథ వారికి ఆ శక్తి ఉన్నదని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారా  అది నీకు ఎలా సంభవిస్తుంది  ఎక్కువగా పల్లెల్లో  రైతు వారీ కుటుంబాల వారు ధనవంతుడు దగ్గరకు వెళ్ళి వారి బాధలు చెప్పుకునే  వారు ఆర్థికంగా సహాయ పడమనే వారు  ఆ డబ్బు కలిగిన ఆయన ఇస్తాను ఇస్తాను అంటాడు నీకెందుకు ఎలాంటి భయం లేదు నేను ఉన్నాను కదా  అని భరోసా ఇచ్చారు  అలా అతనిని తిప్పుతూ ఉంది  నాకు అక్కడి నుంచి రావాలి, ఇక్కడ నుంచి రావాలి వాడు రేపు ఇస్తాడు  వీడు రేపు ఇస్తాడు అంటూ కాలం గడిపి చివరికి అడిగిన ఎవరికి నయాపైసా కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది  అప్పుడు ఆ బీద రైతు  పరిస్థితి ఏమిటి  ఎలా ఆలోచిస్తాడు  ఇతను ఇస్తున్నాడని  వ్యవసాయానికి సంబంధించిన పనులు అన్నీ సన్నద్ధం చేసుకున్న తరువాత  ఆ స్వామి రిక్తహస్తం చూపిస్తే  అతని మనస్సు ముక్కలై పోదా. నన్ను ఎన్ని సార్లు తిప్పాడు  మొదటిసారే ఇవ్వనని చెబితే నేను వేరే ఏర్పాటు చేసుకునే వాడిని కదా. నా మనసు ఇంత క్షోభ పెట్టిన అతను ఏం పాము కుంటాడు. నా ఉసురు అతనికి తగలక పోతుందా అని పరిపరివిధాల దూషించుకుంటూ ఇంటికి వెళతాడు  తరువాత పరిణామాలలో ధనవంతునికి విధి వక్రించి ఉన్న ఆస్తి పోగొట్టుకున్నప్పుడు చూశారా  నాకు చేసిన ద్రోహానికి ప్రతిగా  నా ఉసురు తగిలి ఇలా అయిపోయాడు అని ఆ బాధితుడు చెప్పుకుంటాడు మనకు తెలియకపోయినా ఆ భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు  శిక్షిస్తాడు అన్నది తెలియదా  అన్న వన్నీ నిజమవుతాయి. మోసం చేసిన ఆసామి తగిలిన దెబ్బలను ఉండేలు దెబ్బతో పోల్చి చెప్పాడు వేమన గురిచూసి ఉండేలుతో కొడితే  ఆ దెబ్బ చాలా బాధాకరంగా ఉంటుంది కనుక అలా వ్యవహరించ వద్దు అని మనకు తెలియ చేస్తున్నాడు  తన ఆటవెలది ద్వారా మీరు చదవండి.

"మొదట నాశబెట్టి తుది లేదు పొమ్మను 
పరమ లోబులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా..."


కామెంట్‌లు