దీపం జ్యోతి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈనాడు ప్రతి ఇంట్లోనూ  కరెంటు దీపాల కాంతిలో  కళకళలాడుతూ అనేక రంగుల దీపాలతో  విలసిల్లుతూ  అలంకారానికి కాక అవసరానికి కూడా ఉపయోగపడే వస్తువుగా మారింది  ఈ విద్యుత్ శక్తి లేకపోతే  అనేక కర్మాగారాలకు స్థానం లేదు. ఇవాళ ఇంటిలో కూర వండడానికి కూడా విద్యుత్ శక్తి ఉండి తీరవలసినదే.  మామూలు వెలుగు చదవడానికి సరిపోకపోతే  మరింత కాంతివంతమైన  బల్బులను ఉపయోగించే నేటి యువతకు చెప్పాలి కంటికి  ఈ వెలుగు హాని చేస్తుంది అని భావించిన వారు గాజుతో, ఫ్లౌరసెంట్  బల్బులను తెచ్చి వాడడం మనం నిత్యం చూస్తున్నాం  అందరూ వాడుతున్నావు  ఈ స్థితికి రావడానికి  పాతతరం వారు  ఎంత కృషి చేశారు.ఎంత మంది మేధవుల మేత ఉపయోగపడిందో  చెప్పలేను. మొదట విద్యార్థులు రాత్రి సమయంలో చదువుకోవడానికి ఉపయోగించిన  ప్రథమ సాధనం  ప్రమిద ఆ ప్రమిదలో ఆముదము పోసి దూదితో వత్తులు  తయారుచేసి దానిని ఆ నూనెలో ముంచి తరువాత వత్తిని వెలిగిస్తే ఆ కనిపించీ కనిపించని వెలుగులో దానిని చదవడం నేర్చుకున్నాడు విద్యార్థి. తర్వాత చిన్న  బుడ్డి లాంటి  లైట్ తయారుచేసి దానికి గాజు మూతపెట్టి  గాలికి ఆరిపోకుండా  జాగ్రత్త పడుతూ చదువుకున్నాడు. తరువాత లాంతరు  ఆ తర్వాత క్రమంగా పెట్రో మాక్స్ లైట్లు  వచ్చి వెలుగులు విరజిమ్మే లాగా తయారుచేసుకున్నారు అ
వాటన్నిటిని దాటి ఈరోజు ఎంత వెలుగును  మనం కలుస్తున్నాం  దీని వెనక ఎంత కృషి ఉంది  దానిని జ్ఞాపకం పెట్టుకొని  దానిని శాశ్వతం చేస్తూ  దానిలో  మరికొన్ని మెళకువలు కలిగేలా ఏర్పాటు చేస్తే  యువత  ధన్యత చెందుతోంది.గాలిలో దీపం పెట్టి  దేవుడు అని మహిమ అంటే ఆ దీపం ఆరిపోకుండా ఉంటుందా  దానికి వేమన చెబుతున్న విషయం  ఆ వెలుగు నిలకడగా ఉండాలంటే  కదలకుండా ఉండే  పదార్ధాన్ని ఏర్పాటు చేసుకొని  దానిపైన దీపాన్ని ఉంచి  దాని చుట్టూ గాజు పాత్రలో మూత పెట్టినట్లయితే  ఆ వెలుగు చివరి వరకు ఉంటుంది లేకపోతే ఆ భగవంతుడు కూడా గాలి తాకిడిని ఆపలేరు  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని  ఉద్యోగం చేసే వ్యక్తి  ఏ జ్ఞానాన్ని సంపాదించాలని  ఏ జ్యోతిని చూడాలని  తప్పు చేస్తున్నాడో దాని మీదే మనసు లగ్నం చేస్తే  ఈ దీపపు కాంతి  ఎలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉందో ఆ యోగి కూడా  భగవత్ స్వరూపాన్ని సొంతం చేసుకొని  వారిలో ఐక్యం కావడానికి మార్గం సుగమం అవుతుంది  ఆ ప్రయత్నం చేయండి అని చెప్పడమే  వేమన వేదం  దానిని అర్థం చేసుకొని ప్రవర్తించడమే మన ధర్మం  ఆ పద్యం ఒకసారి చదవండి.


"గాజు కుప్పెలోన గదలక దీపం బదెట్టులుండు  జ్ఞాన మట్టు లుండు
తెలిసినట్టి వారి దేహంబు లందున..."


కామెంట్‌లు