కపాల మోక్షానికి దారి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రపంచంలో ఏ జీవి అయినా ఏ వస్తువైనా  జీవించిన తర్వాత మరణించక తప్పదు  అందుకే గీతాకారుడు జాతస్యహి ధృవో మృత్యువు అన్నాడు. అది ఎన్ని సంవత్సరాల ఆయువు అనేది  ఎవరూ లెక్కించలేరు ఈ పుట్టిన ప్రతి వారు జీవి జీవితం రెండూ కలిసి ఉంటాయి. ఆత్మ పరమాత్మ లాగా  మిగిలిన జంతుజాలానికి లేని అవకాశం అదృష్టం మానవులకు ఉంది. జంతువులు పుడతాయి, పెరుగుతాయి, తిరుగుతాయి అన్ని చేస్తాయి  ఆహార సముపార్జనతో సహా. వీటిని మించి మనిషికి మాట్లాడే శక్తి ఉంది. ఎదుటి వారు మాట్లాడిన దానిని అర్థం చేసుకుని ప్రవర్తించ గలిగిన  జ్ఞానం ఉంది  కానీ ఆ జ్ఞానాన్ని తెలుసుకునేది ఎంతమంది  ఆ కోణంలో ఎవ్వరూ తమ జీవితాలను కొనసాగించరు.  ఏ మహర్షులో, బ్రహ్మర్షులో తప్ప పంచేంద్రియాలతో కూడిన ఈ శరీరం ఎలా నిర్మాణమైంది దాని ప్రయోజనం ఏమిటి అని ఆలోచించినప్పుడు  లోపల జీవి ఏదైతే ఉందో ఆ జీవిని ఆధారం చేసుకుని  వ్యవహరిస్తున్న ఈ శరీరం  దాని చెప్పుచేతల్లో ఉంటుంది. శంకరాచార్యుల వారి జీవి తనువుల కలయిక జీవితం.  ఈ రెండు ఒక దాని పైన ఒకటి ఆధారపడి ఉన్నవి  జీవి మార్గం చూయించగలదు తప్ప  ఆ మార్గంలో వెళ్ళలేదు, శరీరానికి మార్గదర్శకత్వం లేదు ఇది అద్వైత సిద్ధాంతం. ఈ జగతి మొత్తం మీద ఏ దేశంలోనూ జీవితానికి ఆంధ్ర భాషలో ఉన్న అర్థం లేదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రంథాలను గమనించి  అవి ఏమిటో ఎందుకు అలా ఏర్పడ్డాయో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు జ్ఞాని. తన జ్ఞాన సంపద తో  తపస్సమాధికి వెళ్లి  అంతర్ముఖుడై ఈ తనువు లోపల జీవి ఎక్కడ ఉంది ఏ రూపంలో ఉండి అనేది అన్వేషించడానికి ప్రయత్నం చేస్తాడు  తాదాత్మ్యం చెందిన తరువాత కాని ఈ విషయం తనకర్థం కాదు ఈ లోపల బియ్యపు గింజ పైన ఉన్న అర్థచంద్రాకారమంత పరిమాణంలో ఒక చిన్న జ్యోతి కనిపిస్తుంది  ఆ జ్యోతిని కనుగొనడం కోసమే  అనేకమంది ప్రయత్నం చేస్తారు  గమనించిన వారు తమసోమా జ్యోతిర్గమయా సిద్ధాంతాన్ని అనుసరించి  కపాల మోకానికి  అర్హులవుతారు వేమన గారు చెప్పిన ఆటవెలది పద్యం మీకోసం.

"ఆత్మతేజ మూని యనుభవించుట ముక్తి
ఆత్మ తత్త్వమెరుగు అతడే యోగి
ఎరిగి మరగినంత నేకమై తోచురా...."


కామెంట్‌లు