పాపర పండు తత్త్వం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఉపమా కాళిదాసస్య  ఉపమానములను పోల్చి చెప్పడంలో కాళిదాసును మించిన వారు మరొకరు లేరు  అది అందరూ అనుకునే మాట  కానీ వేమన ప్రజల మనిషి  ప్రజలలో రోజు తిరిగిన వాడు  రకరకాల మనస్తత్వాలు తెలిసినవాడు. నిజమైన వారి అసలు రూపం ఏదో ఆ  ఉన్నతమైన వారితో పరిచయం ఉంది  దీనివల్ల వారి  మనస్తత్వాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా తెలుసుకున్నవాడు  పుస్తకాల్లో చదివిన జ్ఞానం కన్నా  అనుభవంతో వచ్చిన జ్ఞానం ఎన్నోరెట్లు గొప్ప  అలాంటివాడు ఇంకొకరితో పోల్చ లేని వాడు. వారు చెప్పిన ఒక పద్యంలో ఒక పోలిక  అలా ఎన్ని వేల పద్యాలలో ఎన్ని వేల  ఉపమానాలు ఉన్నాయో  చదువుతున్న వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగచేస్తాయి.  దానితో పాటు వారి మేధస్సుకు జోహార్లు అర్పిస్తూ పాదాభివందనం చేయాలనిపిస్తుంది కూడా.
జీవితంలో మంచి గుణవంతుడు ఎవరైనా సరే  ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడాలి. అలాంటి వారితో ఎలాంటి పేచీ ఉండదు  నూటికి నూరుపాళ్లు  తన మాటపై నిలబడే  ధర్మాత్ముడు  మరొకడు ఉంటాడు ఎడ్డెం అంటే తెడ్డెం అంటాడు నీకు ఒకటి చెప్తే దానికి వ్యతిరేకంగా ఇంకొకటి అర్థం చేసుకుంటాడు వాడి మనసులో ఉన్నది ఒక అభిప్రాయం అయితే వాడి నోటితో బయటకు వచ్చేది మరొక అభిప్రాయం. బయటకు వచ్చేది మనకు తెలుస్తుంది అంతర్గతంగా ఉన్నది ఎలా తెలుస్తుంది  బ్రహ్మ రుద్రుడు కూడా పసి కట్టలేడు అంత అందంగా నటిస్తాడు జీవితంలో నిజమైన నటులు కూడా ఇతనిలాగా నటించ లేరు అంటే అది అతిశయోక్తి కాదు అలాంటి తత్వాలు కలిగిన వ్యక్తి ఎంతో గొప్పగా పోలికతో చెప్పిన వేమన పద్యం ఒకసారి చూడండి
పాలను పౌష్టికాహారం అంటారు  దాని రుచి కమ్మగా ఉంటుంది  ఈ రెండూ కలిస్తేఎంత రుచి చంటి పిల్లలు కూడా వదలకుండా తాగుతారు    అలాగే పాపర అని ఒక పండు ఉంటుంది  ఈ పాపర పండు  చాలా చేదుగా ఉంటుంది  పుట్టుకతోనే అలా ఉంటుంది ఎంత ప్రయత్నించినా గాని ఆ చేదు పోదు ఆ చేదు పోగొట్టడానికి  ఆ పండు ని తీసుకొచ్చి  దానికి పాలు పంచదార కూడా కలిపి కాచి  తాగడానికి ప్రయత్నం చేస్తే దాని రుచి ఎలా ఉంటుంది  పుట్టుకతో వచ్చింది కదా పుడకలతో గానీ పోదు చేదు చేదే అలాగే కుటిల మానవుని తీసుకొనివచ్చి సద్గుణాలతో వున్న వ్యక్తి దగ్గర నిలబెడితే  ఎన్ని నీతులు చెప్పినా ఎన్ని పద్ధతులలో అతనిని మార్చాలి అనుకుంటున్నా, పాపర పరిస్థితుల్లోనే వుంటుంది మారదు. ఆ రెంటికి పోలిక  ఎంత అందంగా సమయోచితంగా ఉందో ఆలోచించండి  పద్యాలు కూడా చదవండి.
"పాలు పంచదార పాపరపండ్లలో చాల బోసి వండ చవికి రాదు 
కుటిల మానవులకు గుణమేల గల్గురా..."



కామెంట్‌లు