అప్పు చేసి పప్పు కూడు అన్న సామెత మనకు బాగా తెలుసు. అప్పు చేసి మన అవసరాలు తీర్చుకుని దానితో ఎక్కువ తనాన్ని సముపార్జించి అప్పును తీర్చడం ఒక పద్ధతి అతనికి స్తోమత ఉంటే అప్పు ఎందుకు చేస్తాడు ఆ చేసినవాడు జన్మలో తీర్చలేడు అని మరొకరి వాదం. మన పెద్దవారు చెబుతూ ఉంటారు మనకు పొలాలు, ఆస్తులు ఎన్ని ఉన్నా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఎంత ఆదాయం వస్తున్నా పది రోజులు గడపడానికి సరిపోతోంది తప్ప నిజమైన అవసరాలు కుటుంబంలో ఎవరైనా జబ్బుపడవచ్చు మరొకటి, మరొకటి అవసరం రావచ్చు అప్పుడు ఏమి చేస్తాం తప్పకుండా అప్పుచేసి తీరవలసినదే. మన పెద్దలు చెప్పేది ఆస్తిపరుడు ఎవరు అంటే ఒక్క రూపాయి అప్పు లేని వాడు అని తీర్మానం చేస్తారు ఎంతో లోతుగా ఆలోచిస్తే తప్ప పెద్దల మాట మనకు అర్థం కాదు.
వేమన చెప్పదలుచుకున్న విషయాన్ని పోలికలతో మాత్రమే చెబుతున్నాడు. దానిలో అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత ఉంది. మన పెద్దవారు అంటూ ఉంటారు బుద్ధికి పదును పెట్టండి రా అని అలా పదును పెట్టిన కొలది అంతరార్ధాలు ఎన్నో మనకు తెలుస్తాయి మన అమ్మ కాని అమ్మమ్మ కాని వంట చేసేటప్పుడు ఏ వంట చేసినా సరే గాని ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది ఉప్పు అంటేనే రుచికి పర్యాయపదం. బంతి భోజనాలలో రుచిని వడ్డించ మంటారా అని అడుగుతారు ఉప్పు అనే వాడరు కొంతమందికి పట్టింపులు. ఆడవాళ్ళు ఉప్పుని చేతికి ఇవ్వరు ఎందుకు అంటే ఉప్పును ఐశ్వర్యంగా చూస్తోంది గృహిణి తన చేతితో ఇస్తే తనకున్న ఐశ్వర్య మొత్తం ఎదుటివారికి ఇచ్చినట్లవుతుంది అన్న నమ్మకం అది మూఢనమ్మకం కావచ్చు. అలాగే పప్పులు గురించి మాట్లాడుకోవడం చూస్తే రాజుగారి దగ్గరికి ఒక కవి వచ్చి భోజనం దేహి రాజేంద్ర గృత సుప సమన్వితం అంటాడు పప్పులేని కూడు కూడు కాదు అని మన పెద్దలు చెబుతారు శరీర దారుఢ్యాన్ని పెంచడానికి ఆరోగ్యాన్ని ద్విగుణీకృతం చేయడానికి పప్పులు వేసి తీరవలసినదే దానికి తగినట్లు పప్పులు ఉంటే దాని రుచి వేరు. ఆ కమ్మదనం శరీరానికి బలం వస్తుందని మన పెద్దలు చెప్పారు. ఏ వేడుకలు అయినా పప్పు లేకుండా మిగిలిన పదార్థాలు ఉండవు. లేమితో ఉన్నవారు కూడా పప్పు చేసి దానిలో టమోటా కానీ, దోసకాయ కానీ కలగలుపు చేసి తింటారు అప్పుడు రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి అని వారి అభిప్రాయం శరీరానికి ఉప్పు పప్పు రెండు ఉండి తీరవలసినదే. కానీ జీవితంలో అప్పు మాత్రం ఉండకూడదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు వేమన ఆ పద్యాలు చదవండి.
"ఉప్పులేనికూర యెప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడె యధిక సంపన్నుడు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి