చిత్తశుద్ధి ప్రదానం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవుని హృదయం  కరిగిపోతూ ఉంటుంది. ఎదుట కన్పించిన దృశ్యాలకు మనం  బాధను  అనుభవించి అతనికి సహాయం చేయడానికి ఉపక్రమిస్తాము ఆ హృదయాన్ని దాటి మనసుకు వెళితే అది చంచలమైనది క్షణక్షణం గాని ఊహలు,  ఆశలు, అభిరుచులు  ఆదర్శాలు అన్నీమారుతూ ఉంటాయి  సాధారణంగా మన పెద్దలు మనకు చెప్పే నీటి ఒకటి ఉంది  నీవు ఏదైనా దానధర్మాలు చేయదలచుకున్న అప్పుడు  కుడి చేత్తో ఇచ్చేదాన్ని ఎడమ చేతికి ఎడమ చేతితో ఇచ్చేదాన్ని కుడి చేతికి తెలియకుండా చేయాలి  దానిని మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఈ మనో వికారాలు అర్థం అవుతాయి  సహాయం చేయడం కోసం జేబులో చేయి పెట్టి డబ్బులు తీసి  రెండో చేతితో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ రెండు క్షణాల లోనే అతని మనసులో మార్పు వచ్చే అవకాశం ఉంది  కనుక ఆలస్యం చేయవద్దు అని చెబుతూ ఉంటారు మన పెద్దలు  పెద్దల మాట తప్పక మనం పాటించి తీరవలసినదే.
చాలామంది  కొన్ని సందర్భాలలో దానం చేయాలని అనుకున్నా  దానం తీసుకునే వ్యక్తి యొక్క అవసరం ఏమిటో తెలుసుకొని  ఆ అవసరానికి సరిపడిన సహాయం మనం చేయలేము  పూర్తి సహకారం లేకపోతే ఆయన ఏమైనా బాధపడతాడు ఏమో  అన్న ఆలోచనతో అసలు సహాయం చేయడం మానివేసే తత్వాలు కొన్ని ఉంటాయి  దానిని మానుకోవాలి  ఎందుకంటే  మన కొద్ది సహాయంతో పాటు మరికొంతమంది కూడా మరి కొంచెం సహకరిస్తే అతని పని నిర్విఘ్నంగా కొనసాగుతోంది  నీ చేతనయిన సహాయం  ఆర్థిక స్థోమత లేక చదువు మానేసిన వారికి జీతం కట్టడం  బట్టలు లేక  బాధపడుతున్న పిల్లలకు  తక్కువ ఖరీదు అయినా బట్టలు కొని ఇవ్వడం,  ఆకలితో అల్లాడుతున్న వాడికి  అతని పూర్తి ఆకలి తీర్చ లేకపోయినా కనీసం ఒక్క ముద్దయినా సహకారం చేయండి. అతని ఆకలిని కొంతైనా తీర్చిన  వారమవుతాం. దానికి వేమన చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు  మనం మర్రి చెట్టును చూస్తూ ఉంటాము.  ఎంత పెద్దగా ఉంటుంది. దాని కాండం చూసినా దాని ఊడలు చూసిన ముచ్చటేస్తోంది  అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తాం. ఊడలతో ఆడుకోవాలనిపిస్తుంది. చిన్నపిల్లల అయితే వారి ఆట స్థలం గా దాన్ని ఎంచుకుంటారు. కానీ విత్తు  ఎంత ఉంటుంది స్త్రీలు పోపు సామాన్లలో వాడే  ఆవగింజంత ఉంటుంది. అతి చిన్న పరిమాణంలో ఉన్న గింజ  ఇంత వృక్షం అవ్వడానికి కారణం కాదా కనుక మీరు సాయం చేసేది చిన్నదా పెద్దదా అని ఆలోచించకండి  మీ స్థాయిని బట్టి  మీరు చేయగలిగిన అంతవరకే సహకరించి సాయం చేయండి  అవతలివారి ప్రాణాన్ని నిలబెట్టండి.  అది వారికి ప్రాణం  మీకు తృప్తి కలిగిస్తుంది అని అద్భుత మైన  పోలికతో మనలను హెచ్చరిస్తున్నారు వేమన ఆ పద్యాన్ని చదవండి.

"చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు 
కొంచెమైన నదియు కొదువ కాదు 
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత..."


కామెంట్‌లు