ఖలుని గుణము;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రపంచంలో పామును చూసి భయపడని మనిషి లేడు. రక రకాల పాములు  దాని పుట్టుకే స్వార్థంతో నిండి వుంటుంది.  చీమలు పెట్టిన  పుట్టలను తమ సొంతం చేసుకొని  దానిలో నివాసం ఉంటుంది. దానికి చెవులు లేవు భూ ప్రకంపనల వల్ల  పరిస్థితిని గ్రహించే శక్తి దానికి వుంది. దానికి ప్రయోజనం లేకపోయినా ప్రక్కనే వెళ్తున్న మనిషిని కానీ జంతువులు గాని కాటువేసి చంపుతుంది.   పాము కోరల్లో ఉండే విషానికి అంత  శక్తి ఉంది  అలాంటి శక్తి కలిగిన  పాము  చలి చీమల చేత చిక్కిచనిపోతుంది అని వేమన చెప్పిన వాక్యం  దానిని చూసి భయపడి పారి పోయే మనిషి నాగస్వరాన్ని తీసుకొని  ఆ సంగీతంతో దానిని దగ్గరకు తీసి దానిని ఆడిస్తూ జీవనం గడిపే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారిని పాములవారు అంటారు  అలాంటి క్రూర జంతువులను కూడా మన చెప్పుచేతల్లో ఉంచుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అలాంటి విష జంతువుని చంపే ప్రయత్నం చేసిన వారు  జగద్గురు శంకరాచార్యుల వారు  స్వతహాగా పాము  తాను పెట్టిన గుడ్లు పొదిగి  బిడ్డగా తయారైన వాటిని తానే చంపుతుంది అని అంటారు.  దాని బారి నుంచి తప్పించుకున్న వాటితోనే  భూమి నిండిపోయేది. దానిని చంపడం ఎలా అని ఆలోచించి   శంకరాచార్య పాము మనకు  ఆరాధ్య దైవం  నాగుల చవితి నాడు  పుట్టలో పాలు పోసి  చలిమిడి పెట్టి  బెల్లంతో కలిపిన నాన వేసిన పెసరపప్పు ఆ పుట్టలో వేసి  ఆ పైన పాము బయటకి రాకుండా కోడిగుడ్డు పెట్టమన్నాడు  దీని వలన జరిగే ప్రక్రియ ఎలాంటిది. ఆ పాము ఎలా చనిపోతుంది అనేది ఆలోచిస్తే ఈ స్త్రీలు పెట్టిన తీపిపదార్థాలకి చీమలు వచ్చి  ప్రత్యేకించి తెల్లగా ఉన్న చలిచీమలు అన్ని వచ్చి పాములు చుట్టుముడతాయి  ఆ బాధ భరించలేక  బయటకు రావడానికి ప్రయత్నించినా కానీ కోడి గుడ్డు అడ్డు ఉండడంవల్ల  రాలేక అక్కడి చలి చీమల చేత చనిపోతుంది. ఇలాంటి పాపిష్టి జంతువులను  హతమార్చడం  దగ్గరకు తీసుకునే ఆడించడం నువ్వు తెలిసిన మానవుడు, పుట్టినప్పుడే మూర్ఖత్వం  మూర్తీభవించిన మనిషి పుట్టినప్పటి నుంచి జీవితాంతం మూర్ఖుడుగానే ఉంటాడు తప్ప  అతని మూర్ఖత్వాన్ని  మార్చడం అనేది ఆ శంకరాచార్యులవారు తరం కూడా కాదు. నేను చెప్పినది వేదం నేను చేస్తున్నది న్యాయం, చట్టం  అని భీష్మించుకుని కూర్చున్న మనిషి ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా అతని చెవికి ఎక్కుతుందా? అతనే మార్గాన్ని మార్చుకుంటాడా? వేమన మరో పద్యంలో చెప్పినట్లు మూర్ఖుల మనసు రంజింప చేయలేము అన్నట్టుగా  పుట్టుకతోనే దుష్ట ఆలోచనలతో ఉన్న వ్యక్తి మనసును మార్చడం  పామును మార్చినంత సులభం కాదు అని చెప్తున్నాడు వేమన. ఆ పద్యాన్ని మీరు కూడా చదవండి.

"పాముకన్న లేదు పాపిష్టి జీవంబు  
అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘనులెవ్వరును లేరు..."


కామెంట్‌లు