మానవుడు చిరంజీవి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 గిడుతూరి సూర్యం గారు  బాగా చదువుకున్నవాడు  వామపక్ష సిద్ధాంతాలను అధ్యయనం చేసిన వాడు  నాటకం ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకర్షించాలో తెలిసినవాడు అనేక నాటకాలను వ్రాసి వాసిరెడ్డి సుంకర లాగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీ కోసం నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు  సాహిత్యాన్ని, పరిశీలనా దృష్టితో అధ్యయనం చేసిన వ్యక్తి సూర్యం. ఆయన వ్రాసిన ఏ వాక్యం పనికిరానిది అంటూ ఏదీ ఉండదు. ఆకాశవాణికి సరిపోయిన మంచి రచయిత  కానీ ఆయనకు ఇష్టం లేక రాయలేదు  వచ్చి ఉంటే  అందరికన్నా మంచి రచయితగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉండేవాడు.నాటకాలలో అనేక ప్రక్రియలను ప్రవేశ పెట్టినవారు.
గిడుతూరి సూర్యం గారు ఆ రోజుల్లో వామపక్ష  అభిమానిగా మానవుడు చిరంజీవి అనే రూపకాన్ని తయారుచేసి  ప్రచురించారు  ఆంధ్రదేశంలో బాలనాగమ్మ కథ  తో మంచి ప్రాచుర్యం పొందిన వెంకట్రామయ్య గారు  చైర్మన్ నాటకం ద్వారా పేరు తెచ్చుకున్న  కర్ణాటి లక్ష్మీ నరసయ్య గారు  అనేక గ్రామాలలో ప్రదర్శించి మంచి పేరు సంపాదించారు. ఆ నాటకానికి కూడా మంచి పేరు వచ్చింది.  దానిలో పాత్రలన్నీ మైమ్  (మూగ నటన) చేస్తారు. తెర వెనక నుంచి ఆ పాత్రలను  ఒక్కడే చదువుతాడు. మా గన్నవరం ఎమ్మెల్యే రత్న బోస్ ఫస్ట్ నుంచి ఇది నీవు చదవాలి అన్నాడు. రేడియోలో చదివినట్లు చదవడం కాదు ఇది రంగస్థల వేదిక  స్టేజ్ వాయిస్  మెయింటేన్ చేయాలి అన్ని పాత్రలకు అనుగుణంగా కంఠాన్ని మార్చుకుంటూ చేయాలి  దానిలో జమీందారీ పాత్ర చాలా గంభీరమైనది,  కార్మికుని పాత్ర దీనమైనది. భూతం చాలా కష్టమైన పాత్ర అన్ని పాత్రలకు గొంతు మార్చాలి.  ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభను ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యేగా  రామారావు గారి దగ్గర అనుమతి తీసుకొని  ప్రదర్శించడానికి   సిద్ధమయ్యాం. ఆ ప్రదర్శన ఆసాంతం చూసి ప్రదర్శన పూర్తయిన తర్వాత  కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ సుంకర సత్యనారాయణ గారు వేదికపైకి వచ్చి నన్ను, బోసు ను వేదికపైకి పిలిచి, బోస్  నువ్వు ఎమ్మెల్యే కన్నా నాటకాలు ఆడటంలోనే ఎక్కువ రాణిస్తావని అభినందించారు. ఇలాంటి నాటకాలు చూడటం ఇదే ప్రథమం అని నటులనందరిని పిలిచి అందరికి సన్మానాలు చేశారు. వేదిక పైన ఉన్న ఎన్టీ రామారావు గారు మాట్లాడుతూ అది నేను నిర్వహించి చేస్తే ఇంత అందంగా రాదు అని మమ్మల్ని ఎంతో అభినందించారు.  అంత పేరు మాకు తెచ్చిపెట్టిన గొప్ప నాటకం మానవుడు  చిరంజీవి గిడుతూరి సూర్యం గారిది. అందుకు మా ఎం. ఎల్. ఏ ముస్నురు రత్న బోస్ ను అభినందించాలి.


కామెంట్‌లు