అన్వేషకుడు మా ప్రసాద రావు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి వచ్చిన ప్రసాద రావు గారు  విజయవాడలో నాతో పాటు పనిచేసిన ఆత్మీయుడు ఏస్.డి గా వచ్చారు.  ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇద్దరం మాట్లాడుకుని ప్రభాత మంజీరాలు కార్యక్రమం 30 నిమిషాలు అనౌన్సర్ కు అప్పజెప్పి అతను ఏది చెబితే దానిని ఖరారు చేసేటట్టుగా  ప్రభాత మంజీరాల పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత విజయవాడలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రావు గారు ఆనంద్ గారు కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ప్రభాత మంజీరాలు ప్రత్యేకంగా నేను వింటాను  ఆ కార్యక్రమాలు ఎలా చేస్తారో లైవ్ చూడాలని ఉంది మీరు అంగీకరిస్తే రేపు ఉదయం వస్తాను అంటే రమ్మన్నాను ఆయన హేతువాది, వామపక్షవాది  కనుక చాలా జాగ్రత్తగా చెప్పాలని  కేరళలో ఉన్న "లేక్ ఆఫ్ నో రిటర్న్స్" అన్న  అంశాన్ని తీసుకుని  "బెర్ముడా ట్రయాంగిల్" ని కలిపి చెప్పడం ప్రారంభించాను.వాల్మీకి మహర్షి రామాయణంలో ఆంజనేయస్వామి సీతాన్వేషణ కు బయలుదేరే విషయాన్ని తీసుకున్నాను  అక్కడ లంఖిణి అనే రాక్షసి మింగటం  ఆయన మళ్లీ బయటికి రావడం. అది ఎలా సాధ్యం అక్కడ సముద్రంలో నుంచి ఆకాశం పైకి రావడం ఎలా కానీ ఆయన ఆమె కడుపులో పడిన తర్వాత బయటకు వచ్చాడు  ఆంజనేయుని స్వభావము అంగుష్ఠ మాత్రంగానైనా మారగలడు హిమవత్ పర్వతం లాగానై నా పెరగగలడు కనుక అది సాధ్యమైంది. ఆ రోజుల్లోనే శాస్త్రీయమైన అద్భుతమైన పరిష్కారాన్ని చూపించడం మహానుభావుడు వాల్మీకికి మాత్రమే సాధ్యమయింది. ఆయన అవాక్కయ్యారు. ఆనంద్ గారు  దీని కోసం ఎంతో కృషి చేసి ఉంటారని ఎన్నో పేజీలు రాసుకొచ్చి వచ్చి ఉంటారని ఊహించాను  కానీ మీరు ఇలా  ప్రత్యక్ష ప్రసారం లో కాగితాలు లేకుండా చేయడం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తి వేసింది. మీ మెదడు కంప్యూటర్ లాంటిది అని ఆశీర్వదించి వెళ్లారు.  ఇలాంటి అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమం ద్వారా మాకు చాలా సన్నిహితంగా వచ్చారు. ఈ విషయంలో ప్రసాద్ రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకొవాలి.

కామెంట్‌లు