రాజబాబు నాటకాలు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 డాక్టర్ కె వెంకట్ రాజు గారిద్వారా పరిచయం అయిన వాడు ఉమామహేశ్వరరావు  బాగా చదువుకున్నవాడు  నాకు పరిచయం అయిన తరువాత  నేను విజయవాడ కేంద్రానికి డ్యూటీ కి వెళ్ళే ప్రతి రోజు  నాతో పాటు వచ్చి  నేను కార్యక్రమాలు పూర్తి చేసే వరకు ఉండి వెళ్ళేవాడు  అక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో శ్రద్ధగా  తన అనుమానాలను అడిగి తెలుసుకునే వాడు. ఒక్కోసారి చర్చా కార్యక్రమం కూడా చర్చ జరుగుతూ ఉండేది  అలా కాకుండా ఇలా ఉంటే ఎలా ఉంటుంది  ఆ కార్యక్రమానికి మంచి పేరు వస్తుంది కదా  అంటూ తన కారణాలను తెలియజేస్తే  దానికి ఆకాశవాణిలో ఎలాంటి నియమ నిష్టలు ఉన్నాయో చెప్పి ఆ కారణంగా అలా చేయలేము అని వివరించేవాడ్ని. రాజబాబు రాసిన ఒక నాటకాన్ని  ఆధారం చేసుకుని  డాక్యుమెంటరీ తీయడం కోసం  తనకు కావలసిన పద్ధతిలో మార్పులు చేర్పులు చేసి స్త్రీ ల విలువల గురించి గంటకు రాయించి నటీనటులను ఎన్నిక చూసి  కేరళ నుంచి వచ్చి  ఛాయాగ్రాహణునిలో తన ప్రజ్ఞ చూపిన వ్యక్తిని పరిచయం చేసుకుని  అతనిని విజయవాడ తీసుకు వచ్చి  షూటింగ్ కార్యక్రమం ప్రారంభించాము  అప్పటి  పార్లమెంట్ మెంబర్ గోపరాజు రామచంద్రరావు గారి అమ్మాయి  విద్య  గారు ప్రధాన వక్తగా వచ్చి స్త్రీ విలువల గురించి మాట్లాడి ఆమెను గురించి మాట్లాడి మీరు ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది  ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది అని మమ్మల్ని  ప్రోత్సహించి  ఆశీర్వదించి వెళ్లారు  స్త్రీ విద్యకు  ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ  మాంటిస్సోరి పేరుతో  విద్యాలయాన్ని స్థాపించి నడిపిన  కోటేశ్వరమ్మ గారు  తన అనుభవాలను జోడించి  మాకు కావాల్సిన కొన్ని కొత్త విషయాలను కూడా  తెలియజేయడం నాకెంతో ఆనందం అనిపించింది. కార్యక్రమం మొత్తం విజయవాడలోనే జరపాలని నిర్ణయించుకున్నాము.  రాజ బాబుకు తెలిసిన  స్నేహితుల బంధువుల సహకారంలో విజయవాడలో మూడు రకాల  గృహాలను ఏర్పాటు చేసుకున్నాం  సామాన్య కుటుంబంలో జరిగేది ఒకటి  అతి బీద కుటుంబంలో ఉన్న పద్ధతి రెండవది  విలాసంగా ఉండే కుటుంబాలలో  ఉండే జమీందారీ పద్ధతి మూడవది  మాకు చాలా ఆనందంగా  ఉన్న ప్రధానాంశం. మేము ఏ ఇంట్లో  నిర్మాణ కార్యక్రమం చేస్తున్నాము  ఆ ఇంటి వారు మాకు కావాల్సిన  అవసరాలను అన్నీటిని తీరుస్తూ  వారి స్థాయిలో మాకు ఎంతో  సహకరించాడు  వారి కుటుంబ సభ్యుల వలే మమ్మల్ని  ఆదరించారు.  నటీమణులకు ప్రత్యేకమైన  ఏర్పాట్లను కూడా  ఇండ్ల లోనే చేసేవారు కళలంటే సామాన్య ప్రజలకు కూడా ఎంత  అభిమానమో ప్రత్యక్షంగా తెలుసుకోవడం  ఎంతో ఆనందించవలసిన విషయం  మేము అనుకున్న దాని కన్నా  నిర్మాణం  బాగా వచ్చింది  అందరికీ సంతృప్తిగా ఉంది.

కామెంట్‌లు