సంగీతజ్ఞులకు కర్ణాటక, హిందుస్థానీ బాణీలు బాగా తెలిసి ఉంటాయి. రెంటినీ ఆస్వాదించగలరు వీటిలో మళ్లీ శాస్త్రీయము, లలిత శాస్త్రీయము, లలిత గీతాలు జానపద గీతాలు అన్న పద్ధతులున్నాయి. జానపద గీతాలు అనగానే పల్లెల్లో నివసించే వారు వారి పెద్దల నుంచి నేర్చుకున్న గీతాలను ఆలపిస్తూ గెంతులు వేసే సంగీతం అనుకుంటారు కానీ జానపదంలో ఉన్న విశిష్టత తెలిస్తే దాని మీద గౌరవం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతోంది. అసలు ఏమిటి ఈ జన పదము జనుల యొక్క పదములు (పాటలు) పనులు చేసేటప్పుడు వారి కష్టాలు మర్చిపోయి గుండెల్లోని బాధను మరచిపోవడానికి పాటగా చెప్తారు. కానీ దాని మూలం జానపదం కాదు జ్ఞాన పథం నీతిని, ధర్మాన్ని చెప్పడానికి ఏర్పాటు చేయబడిన సంగీత నిధి ఆ మార్గంలో వారు చెప్పే అనేక విషయాలు వినడానికి శృంగారపరంగా అనిపించినా అద్భుతమైన వేదాంతాలు చాలా ఉన్నాయి అది అర్థం చేసుకున్న వారికే తెలుస్తుంది.
సంగీతానికి స్వరం ఎంత ముఖ్యమో తాళం కూడా అంతే ముఖ్యం. లెక్క తప్పకూడదు జానపదం కూడా బెత్తి, జాన, బార లాంటి కొలతలతో చెప్పబడే సంగీతం. దానిలో కూడా తాళం తప్పకూడదు శృతి ప్రక్కకు వెళ్ళకూడదు ఆ నియమాలు పాటిస్తే అది జానపద సంగీతం ఎక్కువగా బావా మరదలు సరసాలు ఉంటాయి. శృంగారంగా చెప్పుకున్నట్టుగా ఉంటాయి కానీ లోతుగా ఆలోచిస్తే ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో కనిపిస్తాయి. దొంగతనంగా తోటలోకి గోంగూర కోయడానికి వెళ్ళిన మరదల్ని ఆట పట్టించడానికి భావం చెప్పే పాట వినడానికి ఒక రకం, అర్థం చేసుకోవడానికి మరోరకంగా వుంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే జానపదాన్ని అని చులకన చేసే వాళ్ళు ఉండరని నా అభిప్రాయం.
జానపద గేయం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి