మంజుల నాటకం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేనూ తుర్లపాటి బాబ్జి  మంజుశ్రీ కళానికేతన్ సంస్థను స్థాపించి  అనేక నాటకాలను  సంగీత రూపకాలను ప్రదర్శించాము. ప్రతి నెల ఒక చర్చా కార్యక్రమాన్ని పెట్టి భిన్న భిన్న అభిప్రాయాలతో గోష్టులను ఏర్పాటు చేశాం.  మాకు రేడియో వి ఎస్ నారాయణ మూర్తి మంజుల సంగీత రూపకాన్ని రచించాడు.  దానిలో మొదటిసారిగా నేను వేదికపై ముసలి పాత్ర వేశాను.  అద్దంకి శ్రీరామమూర్తి గారి అబ్బాయి ప్రసాద్ నాకు కొడుకు. నా మేనకోడలుగా మధు నిర్మల (మంచి నాట్యకత్తె) నాటకం మొత్తానికి ఆమె నాట్యం ప్రదానం. మాతోపాటు రామకృష్ణ, వెంకటేశ్వరరావు, మధు నిర్మల చెల్లి కూడా పాల్గొన్నారు. మా ఆస్థాన దర్శకులు కబీర్ దాస్  దీనికి కూడా దర్శకత్వ బాధ్యత వహించాడు. విజయవాడ లోనే కాక అనేక పట్టణాలలో  ప్రదర్శనలు ఇచ్చాం. దానిలో పనిచేసిన బృంద ఇవాళ టీవీ  సీరియల్స్ లో ప్రధాన పాత్ర వహిస్తోంది  అది మాకెంతో గర్వకారణం. విజయవాడలో మంజుశ్రీ కళానికేతన్ సంస్థ స్థాపించడానికి ముఖ్యకారణం  సంస్థలో నటులతో పాటు  సంగీతం తెలిసినవారు  రచయిత కూడా ఉంటే బాగుంటుంది మిగిలిన ఎవరి సహకారం ఉన్నా, లేకపోయినా నాటకము ఆగడానికి అవకాశం ఉండదు. నా మిత్రుడు తుర్లపాటి బాబ్జీ నాటకాలు-నాటికలు వ్రాశాడు  విషయం చెప్పి దానిని నాటకంగా మలచమంటే రెండు రోజులలో నాటకాన్ని తయారు చేయ గలరు  రంగస్థలం మీదేకాక ఆకాశవాణికి కూడా నాటకాలు రాయడంలో ఆ రెండు మాధ్యమాలు తెలిసినవాడు  చాలా నాటకాలు  ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. మూడు పుస్తకాలు  ప్రచురించబడ్డాయి. మా గురువుగారు నండూరి సుబ్బారావు గారి  సోదరుని కుమార్తె మధు నిర్మలకు నాట్యంలో ప్రావీణ్యం ఉంది  సంగీతం బాగా తెలిసిన అమ్మాయి పాటలకన్నిటికి  తను స్వరకల్పన చేయగలదు  ఒకప్పుడు  రంగస్థల నాటకాలలో పౌరాణిక వారితోపాటు సాంఘికాలు కూడా వేసిన శ్రీ రామ మూర్తి గారి అబ్బాయి ప్రసాద్  కథానాయకుడిగా నేను  ప్రధాన పాత్ర వహిస్తూ మాతో నిర్మల కథానాయికగా  అనేక చోట్ల నాటక ప్రదర్శనలను  ఇచ్చి అందరి పొగడ్తలను పొందాం. అద్దంకి తో పాటు రామకృష్ణ  లాంటి వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు పెట్టడం  కొంత మంది మరణించడం  వయస్సు మీరి రాలేకపోవడం వంటి కారణాలతో  ప్రత్యేకించి తుర్లపాటి బాబ్జి మరణం  మా సంస్థకు ఎంతో తీరని లోటు  నేను విశాఖపట్నం వెళ్లడంతో  సంస్థను మూసివేయవలసి వచ్చినది.

కామెంట్‌లు