హర హర మహాదేవ ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 విజయవాడ కేంద్రంలో నాకు బాగా పేరు తెచ్చిన నాటకం  సత్యం శంకరమంచి వ్రాసిన హర హర మహాదేవ.

శంకరమంచి సత్యం గారు అమరావతిలో పురోహితుల కుటుంబంలో ఉన్న వ్యక్తి. అమరావతిలో ఉన్న స్వామి పూర్వాపరాలను తెలిసినవారు. తన కుటుంబం ఎంతోకాలం నుంచి  స్వామివారిని అర్చించుకుంటూ జీవితాన్ని గడుపుతున్న వాళ్లే  భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే వారికి చాలా ఇష్టం  ఆ నాటకంలో మూడు పాత్రలను. తాను, తన అన్నలను దగ్గర ఊహించుకొని వ్రాసిన నాటకం పెద్ద అన్న గారు స్వామికి కైంకర్యం చేయకుండా భోజనం చేసే స్థితికి వెళ్ళలేదు తర్వాత  చిన్నన్న ఈనాటి కాలానికి అనుగుణంగా తన పద్ధతులను మార్చుకుని ప్రవర్తించిన వాడు తాను చిన్నవాడు అభ్యుదయ భావాలు కలిగిన వాడు  అర్చకుడు అన్న వాడికి కూడా ఒక ఉద్యోగం చేసే ఏ ఉద్యోగి అయినా ఎనిమిది గంటల పని చేస్తారు ఇక్కడ కూడా నేను అదే పని చేస్తాను ఈ ఎనిమిది గంటల తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని గురించి అలవాట్లను గురించీ నేను చేసే పనుల గురించి మాట్లాడే అధికారం ఏ ఒక్కరికి లేదు అని నిర్వాహకులతో పోరాడిన వ్యక్తి. అయితే చివరలో భక్తి అన్నది  శరీరానికి సంబంధించినదా, మనసుకు సంబంధించినదా అన్న వాదం పెట్టి  మనసులో స్వామిని ధ్యానించుకుంటూ ఆర్తితో వారిని పిలిస్తే ఎక్కడ ఉన్నా పనిగట్టుకుని వస్తాడు అని చెప్పడమే హర హర మహాదేవ నాటకం. సత్యం గారి పాత్రలో నన్ను ఊహించుకొని చక్కటి వాక్యాలతో అభ్యుదయ భావాలతో వ్రాసిన నాటకం. ఈ నాటకంలో  నటించిన అందరి నటీనటులకు మంచి పేరు వచ్చింది  అనేక పర్యాయాలు ఆ నాటకాన్ని ఆకాశవాణిలో విన్న శ్రోతలు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదించారు తప్ప విసుగు వచ్చిందని ఏ ఒక్కరూ అనలేదు. నేను విశాఖపట్నం వెళ్ళిన తర్వాత  నాకింత పేరు తెచ్చి పెట్టిన సత్యం గారికి ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చి వారు వ్రాసిన అమరావతి కథలు పుస్తకంలో  100 కథల్ని 100 నాటికలుగా మలిచి  విశాఖపట్నం నాటక రచయితలతో వ్రాయించి ప్రతి రోజు 15 నిమిషాలు ప్రసారం చేశాను. అధికారి భూషణ్ రావు గారు కూడా మంచి సహకారం అందించారు. నాకు నచ్చిన కళాకారులను  నాకు ఇచ్చి  మీ ఇష్టం వచ్చినట్లు చేయండి నాకేం అభ్యంతరం లేదు అన్నారు.  దానితో పాటు ఆయన కూడా వేషాలు చదివేవారు అంత కుతూహలం చూపారు ఆ నాటకం మీద.  దానితో 100 నాటికలను వంద రోజులు వరుసగా ప్రసారం చేశాను అదొక తృప్తి. దీని తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చింది. పానుగంటి వారు రాసిన సాక్షి వ్యాసాలను  ఒక్కొక్క వ్యాసాన్ని ఒక్కొక్క నాటికగా వ్రాయించి ప్రసారం చేశాను. మూడు నెలలపాటు వరుసగా ఆ నాటకాలు రావడంతో ఆకాశవాణి విశాఖపట్నానికి మంచి పేరు వచ్చింది సంచాలకులు నన్ను పిలిచి అభినందించడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.


కామెంట్‌లు