కాలేజీ నాటకం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 మా గ్రామం కృష్ణా జిల్లా తేలప్రోలు  మా గ్రామంలో చదువుకున్న వారు  ప్రత్యేకించి పీహెచ్డీ చేసిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు  మామూలు చదివిన వాళ్లు లెక్కలేదు  వీరందరూ చాలామంది  లయోలా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్లే  అందువల్లనే ఏమో నేను ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆంధ్రా లయోలా కాలేజీలో చదవాలనే కోరిక  నేను ఎస్ఎస్ఎల్సీ చదివిన తర్వాత లయోలా కాలేజీకి వెళ్తే  నన్ను గోరా గారి అబ్బాయి నియంతను మా గ్రామం ప్రక్కన ఆతుకూరు  స్టాలిన్ ను పేర్ల వల్ల చేర్చుకోమన్నారు. నేను ఫాదర్ మత్తయ్యాస్ ప్రిన్సిపల్ ను కలిసి నా కోరిక మన కాలేజీ లో చదవాలని  మీరు తీర్చకపోతే నేను చదువు మాని వేయవలసి వస్తుంది  అయినా కారణం లేకుండా ఎందుకు నన్ను చేర్చుకోలేదు అని అడిగితే నీ పేరు పలకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది  నీ పేరు మార్చుకుంటే చేర్చుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు  అలాగే నంటే ఆనంద రెడ్డి అని ఆయనే సలహా ఇస్తే నేను అంగీకరించాను కాలేజీలో చేరాను అక్కడంతా నాకు కొత్త  నేను ఉన్నది హాస్టల్లో సమయ నిబద్ధతకు దూరంగా ఉండే నన్ను సమయానికి బద్దుని చేసింది లైలా కాలేజ్. ఒక్క క్షణం అటు ఇటూ కాకుండా హాజరయ్యే స్థితికి తీసుకొచ్చింది అక్కడి క్రమశిక్షణ. హిత శ్రీ గారు రాసిన విముక్తుడు నాటకాన్ని నేను అనేక చోట్ల ప్రదర్శించాను. దానిని లయోలా కాలేజీలో ప్రదర్శించడానికి ప్రిన్సిపాల్ మత్తయ్య గారు అంగీకరించలేదు. దాదాపు నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను పి.యు.సి చదువుతున్నాను చివరకు ఆయనను ఒప్పించి  విశాఖపట్నం వెళ్లి లైలా కాలేజీ తరుపున మొదటిసారిగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే ప్రథమ బహుమతి వచ్చింది. అప్పటి వరకు ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీలో విశ్వనాథ సత్యనారాయణ గారి నాటకాలకు బహుమతి రావడం ఆనవాయితీ. దానికి భిన్నంగా లైలా కాలేజీ కి తీసుకొచ్చిన ఘనత నాకే దక్కుతుంది. ఆ నాటకానికి ఎస్ టి పి రామకృష్ణమాచార్యులు గారు  దర్శకులు, ఎస్ టి పి రాధాకృష్ణమాచార్యులు గారు నిర్వాహకులు. ఇందులో శ్రీధర్, సురేష్, మూర్తి నేను పాల్గొన్నాం. సిని  పరిశ్రమలో శ్రీధర్ కొంతకాలం ఎడిటర్ గా పనిచేసి  చిన్న వయసులోనే మరణించాడు  అది మాకు ఎంతో బాధ కలిగించింది.


కామెంట్‌లు