రాజబాబు నాటకాలు;-ఏ బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 ఉమామహేశ్వర రావు గారికి మొదటి నుంచి  వామపక్ష సిద్ధాంతాలపై గట్టి పట్టు ఉంది  దానితో దానికి సంబంధించిన  కథ వ్రాసుకొని కొన్ని సంఘటనలను  ఆలోచించి దానిలో పెట్టి రెండు గంటలకు  సరిపడా స్క్రీన్ ప్లే తయారు చేసాడు ప్రధానంగా స్త్రీ పాత్ర  తెలుగు తమిళ భాషల్లో  ప్రత్యేకత నింపుకున్న  నటి రేవతి  మొదటి సినిమా అక్కినేని నాగేశ్వర రావు గారి తోనే నటించి నీవా నేనా అన్న స్థాయిలో  ప్రథమశ్రేణిలో నటించిన నటీమణి. ఆమెతో మాట్లాడి ఒప్పించి హిందీ నుంచి మరొక నటునిని తీసుకొచ్చి సినిమా తయారుచేస్తే దర్శకుడిగా మంచి పేరు వచ్చింది డబ్బులు వచ్చినాయి. రేవతి కూడా చాలా ఆనందించారు ఆమెకు జాతీయ బహుమతి వచ్చింది కూడా. దాంతో రాజబాబు గారు కాబట్టి తీయబోయే సినిమా కూడా అతడినే దర్శకునిగా ఎన్నిక చేద్దాం అని నిర్ణయించి  అతని నిర్వహణలో సినిమా తయారుచేసాం. డాక్టర్ కె. వెంకట్ రాజు గారికి  కథల ఎన్నికనో అనుభవం ఉంటే  చిత్ర నిర్మాత వీరయ్య గారు తీసిన సినిమాలకు  కథలను ఎన్నిక చేసింది వారే. లేకపోతే రామారావు గారు భానుమతి గారు నటించిన పలనాటి యుద్ధం సినిమా ఉండేది  కాదు. ఆ సినిమాలో తాను ఒక పాత్ర కూడా ధరించి ఒక పద్యం కూడా పాడారు.వారికి కథ వినిపించినప్పుడు  తీసుకున్న కథావస్తువు చాలా బాగుంది కానీ దానిని మలచడంలో చాలా మలుపులు ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటే తప్ప ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చదు  అని చెప్పారు  అదంతా నేను చూసుకుంటాను మాస్టారు అని మాట ఇచ్చి స్క్రీన్ ప్లే ప్రారంభించి  తనకు నచ్చిన పద్ధతిలో  తయారుచేశాడు ఉమామహేశ్వరరావు. అయితే సిద్ధాంతాలు వినడానికి బాగుంటాయి కానీ చేతల్లో  కాదు. పాత్రధారుల ఎంపిక పూర్తి చేసిన తరువాత  తనకు కావలసిన సాంకేతిక నిపుణులను ఎన్నుకొని  సినిమా ప్రారంభించారు  విజయ వాహిని మించి చేయాలన్న పట్టుదలతో  రూపాయికి రెండు రూపాయలు ఖర్చు చేసి  రాజబాబు అనుకున్న బడ్జెట్టును రెండు మూడు రెట్లు  పెంచడంతో  నిర్మాతగా రాజబాబు  ఇబ్బంది పడ్డాడు.  స్నేహ ధర్మం లో అతనిని ఏమి చేయలేని పరిస్థితి. నేను ఎంత సున్నితంగా చేసినా అర్థం చేసుకునే పరిస్థితి దర్శకునికి లేకపోవడం వచ్చిన నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ కూడా  మిగిలిన సుఖాలకు అలవాటు పడి  అరగంటలో కావాల్సిన పనిని గంటన్నర చేయడం  దాని వల్ల పూర్తిగా నిరాశా నిస్పృహలకు లోనయిపోయిన రాజబాబు నిజంగా ఇది విజయాన్ని సాధించినా పెట్టుబడి మొత్తం కూడా రాదు అన్న నిర్ణయానికి వచ్చారు  చివరకు ఆ రోజుల్లో ఏడు లక్షలతో ఆ సినిమా నుంచి బయట పడ్డాడు రాజబాబు. మళ్లీ సినిమాల గురించి  ఆలోచించలేదు.


కామెంట్‌లు