మా హాస్యనట చక్రవర్తి;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 మనిషికి చేయగలిగిన సత్తా ఉన్నప్పుడు ప్రపంచమంతా మంచిగానే కనిపిస్తుంది. నేను విశాఖ పట్నంలో పని చేస్తున్న రోజుల్లో ఓ రోజు మాటల సందర్భంలో సి. వి సూర్య నారాయణ గారు మీ గురువు గారు నండూరి సుబ్బారావు గారు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆయన ఎందుకు అడిగారో నాకు అర్ధం కాలేదు. సమాధానంగా పదవీ విరమణ చేసిన తరువాత పక్షవాతం వచ్చింది చాలా వరకు తగ్గుముఖం పట్టింది బయటకు రావడం లేదని చెప్పాను. ఒకసారి పిలిపించండి ఒక నాటకం చేద్దాం దాని దర్శకత్వ బాధ్యత ఇచ్చి వేషం కూడా వెయిద్దాం  దాంతో కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనం వేషాలు వేద్దాం అని చెప్పేసరికి గురువు గారికి ఫోన్ చేసి మా అల్లుడు గారి కారు తీసుకొని వారిని విజయవాడ నుంచి తీసుకొచ్చాం. నన్ను, సి.వి సూర్య నారాయణ ను చూసి ఎంత ఆనందించారో చెప్పడం కష్టం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తోంది. ఈ నాటకం విషయం, వేషం విషయం చెప్పే సరికి చాలా ఆనందించారు. గంట నాటకం తీసుకొని మూడు రోజులు  కుస్తీ పట్టి రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఆఫీసు కారులో ఆ పరిసర ప్రాంతాలన్నీ తిప్పి  దేవస్థానాలు, అరకు అన్నీ తిప్పేసరికి ఆయన ఆనందానికి అవధి లేదు ఆ మూడు రోజులు మా ఇంట్లోనే ఉన్నారు తర్వాత మా అల్లుడు గారితో విజయవాడ వెళ్ళారు కారులో ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపు మూడు పేజీల ఉత్తరం నాకు, సివి కి వ్రాసి  కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసి  నీవు నా శిష్యుడ వైనందుకు మంచి బహుమతి ఇచ్చావు అని కొనియాడారు అంతకు మించిన ఆనందం మరేమీ ఉంటుంది ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.

నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తికి ఆ మాత్రం సహకరించక పోతే పశువుకు నాకు భేదం ఏముంటుంది.


కామెంట్‌లు