ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు;--వలిపే సత్యనీలిమ--చరవాణి:9502156813
 సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ పేరు:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
=========================
181.
నూతన సరికొత్త ప్రక్రియై
అందరి మనసును ఆకర్షించి
రచనలు ఎన్నో చేయిస్తుంది
చూడచక్కని తెలుగు సున్నితంబు
182.
సున్నితమైన పదాల అల్లికతో
సునిశితమైన భావార్థ సముదాయంతో
అందరి అభిమానం చూరగొన్నది
చూడచక్కని తెలుగు సున్నితంబు
183.
సులభంగా రచనలు చేయించి
అందరితో మన్ననలను పొందించి
పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది
చూడచక్కని తెలుగు సున్నితంబు
184.
సునీత ఆలోచనలకు రూపము
తెలుగుతల్లి మెడలో హారము
సున్నితం ప్రక్రియ స్వరూపము
చూడచక్కని తెలుగు సున్నితంబు
185.
సాగుతోంది ఇలా గమనం
ఎన్నటికీ ఆగదీ ప్రయాణం
నూతన ఒరవడికి స్వాగతం
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు