సర్వశ్య శరణాగతి;- సి.హెచ్.ప్రతాప్ ;-సెల్ ; : 95508 51075
 శ్రీ శిరిడీ సాయి బాబాకు  అత్యంత సన్నిహిత , ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట విరేచనాలు వలన తీవ్రంగా బాధపడ్డాడు. స్వతాహాగా ధనవంతులవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టర్లకు చూపించుకొని వారిచ్చిన మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. తామిచ్చిన మందులేమీ పని చెయ్యకపోవడం వలన డాక్టర్లు కూడా పెదవి విరిచేసారు. తమ విజ్ఞానానికి, మేధస్సుకు అందని ఒక విచిత్ర వ్యాధి బూటీకి సోకిందని, కాబట్టి తమ కంటే పేరు మోసిన డాక్టర్లను సంప్రదించాల్సిందేనంటూ వారు బూటీకి సూచన చేసారు.  కొద్ది రోజులలోనే బూటీ బాగా నీరసించిపోయాడు. కదల లేకపోవడం వలన శ్రీ సాయి దర్శనానికై మశీదుకు పోలేకపోయాడు. అప్పుడు బాబా అతనిని మసీదు కి రమ్మని కబురు పంపించి, బూటీ రాగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ “ తస్మాత్ జాగ్రత్త ! నువ్విక విరేచనములు చేయకూడదు “ అని దృఢంగా పలికారు. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరోచనాలు ఆగిపోయాయి. గొప్ప గొప్ప డాక్టర్లు, విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది. నాటి నుండి బుటీకి శ్రీ సాయి అంటే ఎనలేని గురి కుదిరింది. భగవంతుడికి, సద్గురువులకు సర్వశ్య శరణాగతి చేస్తే చాలు, తమ యోగ క్షేలన్నింటినీ వారే చూసుకుంటారన్న ధృఢ విశ్వాసం బూటీకి అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది.
సి హెచ్ ప్రతాప్ 


ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 

కామెంట్‌లు